Ireland beat England by 5 runs (Photo-Twitter)

టీ20 వరల్డ్‌కప్‌-2022లో మరో సంచలనం నమోదైంది. సూపర్‌-12 గ్రూప్‌-1లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 26) జరిగిన మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌ పటిష్టమైన ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐర్లాండ్‌ 5 పరుగుల తేడాతో హాట్‌ ఫేవరెట్‌ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌.. మార్క్‌ వుడ్‌ (3/34), లివింగ్‌స్టోన్‌ (3/17), సామ్‌ కర్రన్‌ (2/31), స్టోక్స్‌ (1/8) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు చాపచుట్టేసింది.

ఈ ఏడాది ప్రపంచకప్‌లో తొలి సెంచరీ, 56 బంతుల్లో 109 పరుగులు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌ రిలీ రోసో, బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోసిన రోసో

కెప్టెన్‌ బల్బిర్నీ (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 105/5 వద్ద ఉండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు