Babar-Rizwan (Photo-ICC/Twitter)

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లో న్యూజిలాండ్ విసిరిన 153 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ ఛేజించింది. ఫైనల్ లోకి అడుగుపెట్టింది. రేపు భారత్ -ఇంగ్లండ్ మధ్య పోరులో గెలిచిన టీంతో తాడోపేడో తేల్చుకోనుంది. నేటి మ్యాచ్ లో పాకిస్తాన్ ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్లు గా వచ్చిన రిజ్వాన్, బాబర్ ఆది నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ముఖ్యంగా ప‌వ‌ర్‌ప్లేలో ఓపెన‌ర్లు రిజ్వాన్‌, బాబ‌ర్లు స్వేచ్ఛ‌గా షాట్లు ఆడారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఓపెన్లరు హాప్ సెంచరీలను సాధించారు. బాబర్ ఆజం 53 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద మిచెల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక 57పరుగులు చేసిన రిజ్వాన్ బౌల్ట్ బౌలింగ్ లో ఫిలిప్స్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన బ్యాటర్లు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించారు.  7 వికెట్ల తేడాతొ పాకిస్తాన్ ఘన విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌.. పాకిస్థాన్‌కు 153 ర‌న్స్ టార్గెట్ విసిరింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ చేసింది. డారెల్ మిచ‌ల్ టీ20ల్లో మూడ‌వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 50 ర‌న్స్ చేశాడత‌ను.

పాకిస్తాన్ ఫైనల్ చేరాలంటే 153 ర‌న్స్ చేయాలి, 20 ఓవర్లలో నాలుగు వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ చేసిన కివీస్

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నా.. అత‌ను సింగిల్స్ తీస్తూ ఆచితూచి ఆడాడు. నాలుగో వికెట్‌కు మిచెల్‌, విలియ‌మ్‌స‌న్ 68 ర‌న్స్ జోడించారు. కివీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్ 53(నాటౌట్‌), విలియ‌మ్‌స‌న్ 46, కాన్వే 21, నీష‌మ్ 16(నాటౌట్‌) ర‌న్స్ చేశారు.