IND Vs NZ ODI Tickets : ఉప్పల్ మ్యాచ్‌ టికెట్లు విడదల, తొలిరోజు అందుబాటులోకి కేవలం 6వేల టికెట్లు, ఎక్కడ బుక్ చేసుకోవాలి? ఎప్పటివరకు అమ్ముతారంటే?
Tickets for India vs New Zealand ODI (Photo-IANS)

Hyderabad, JAN 13: ఈ నెల 18న హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) ఇండియా–న్యూజిలాండ్ (IND Vs NZ) జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు హెచ్‌సీఏ తెలిపింది. పేటీఎమ్ యాప్‌లో (Paytm) టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. హెచ్‌సీఏ తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 29 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే, శుక్రవారం 6 వేల టిక్కెట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉంచారు. మిగతా టిక్కెట్లను దశలవారీగా అందుబాటులోకి తెస్తారు.

India Squad for Australia Test Series: లాంగ్ గ్యాప్‌ తర్వాత టీమిండియాలోకి రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం టీమ్ ప్రకటించిన బీసీసీఐ, రిషబ్ పంత్ ప్లేస్‌లో ఎవరిని తీసుకున్నారంటే? 

ఈ నెల 16, సోమవారం వరకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఇటీవల ఉప్పల్‌లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే వారం జరగబోయే మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నారు.

IND vs SL 2nd ODI: వీడియో ఇదే, సిరాజ్‌ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ అయిన ఫెర్నాండో, బంతి స్వింగ్‌ అయ్యి మిడిల్‌ స్టం‍ప్‌ను గిరాటేయడంతో ఎగిరిపోయిన స్టంప్ 

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు వాటికి సంబంధించిన క్యూఆర్ కోడ్ చూపించి ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు. వీటిని మాత్రం ఈ నెల 18 వరకు అందిస్తారు. మరో రెండు రోజుల్లో న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ చేరుకుంటుంది. మరుసటి రోజు టీమిండియా చేరుకుంటుంది. తర్వాత రెండు జట్లూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాయి. 18న మ్యాచ్‌లో పాల్గొంటాయి.