
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. వరుణ్ చక్రవర్తి తన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మ్యాట్ హెన్రీ (2) వికెట్ ఈ మ్యాచ్‌లో వరుణ్‌కు ఐదవది. విరాట్ కోహ్లి క్యాచ్ పట్టడంతో హెన్రీ ఔటయ్యాడు.
ఈ గెలుపుతో గ్రూప్ -ఎలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌ఇండియా.. మంగళవారం (మార్చి 4) జరిగే తొలి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక గ్రూప్ బీ నుంచి మరో జట్టు సౌతాఫ్రికా వర్సెస్ న్యూజీలాండ్ జట్టుతో తలపడనుంది. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుండగా సౌతాఫ్రికా వర్సెస్ న్యూజీలాండ్ జట్టు మ్యాచ్ పాక్ లోని లా హోర్ గడాఫీ స్టేడియంలో జరగనుంది.