Virat Kohli-T20 World Record: ప్రపంచ రికార్డుకు పరుగు దూరంలో కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్, శ్రీలంకతో మూడు టీ20ల సీరిస్‌కు సిద్ధమైన భారత్, ఈ ఏడాది ఆరంభంలో తొలి సీరిస్ ఇదే
Virat Kohli. (Photo Credits: Getty Images)

Guwahati, December 04: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు(sri lanka Vs india T20I series) టీమిండియా సిద్ధమైంది. ఆదివారం శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను, మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ ఏడాది ఆరంభపు సిరీస్‌లో కూడా సత్తాచాటి శుభారంభం చేయాలనుకుంటోంది.

ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని (Virat Kohli)ఒక రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విరాట్‌ కోహ్లి.. అంతర్జాతీయ టీ20 పరుగుల్లో సహచర ఆటగాడు రోహిత్‌ శర్మతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు రోహిత్‌ను(Rohit Sharma) దాటేసే అవకాశం కోహ్లి ముందుంది.

T20 ప్రపంచ రికార్డుకు(T20I world record) కేవలం ఒక్క పరుగుదూరంలో నిలిచాడు. ఆదివారం గువాహటి వేదికగా శ్రీలంకతో జరగాల్సి ఉన్న మ్యాచ్‌కు ముందు కోహ్లీ ముంగిట రికార్డు నిలిచి ఉంది. ఈ షార్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఘనత దక్కించుకున్న రోహిత్ శర్మను దాటేయనున్నాడు.

ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి-రోహిత్‌లు తలో 2,633 పరుగులు సాధించి టాప్‌లో కొనసాగుతున్నారు. రేపటి మ్యాచ్‌లో రోహిత్‌ను కోహ్లి అధిగమించడం దాదాపు ఖాయం. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో కోహ్లి సింగిల్‌గా అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంటాడు. కేవలం పరుగు సాధిస్తే రోహిత్‌ను అధిగమించే కోహ్లి.. లంకేయులతో టీ20 సిరీస్‌లో పరుగుల వేట కొనసాగిస్తే మాత్రం హిట్‌ మ్యాన్‌కు అందనంత దూరంలో నిలుస్తాడు.

డిసెంబరులో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ విజృంభించాడు. 50బంతుల్లో 94పరుగులు చేసిన కెప్టెన్.. 208పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కీలకంగా వ్యవహరించాడు. మూడో టీ20లోనూ అంతకుమించిన దూకుడుతో 29బంతులకు 70పరుగులు చేయడంతో భారత్ 3వికెట్ల నష్టానికి 240పరుగులు చేయగలిగింది. ఇదే ఫామ్‌ను శ్రీలంకతో జరుగనున్న పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌లో కూడా కొనసాగించాలని కోహ్లీ యోచిస్తున్నాడు.

మరి కొద్ది నెలల్లో మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్‌కు ముందు కోహ్లీ కొనసాగిస్తున్న ఫామ్ జట్టుకు లాభాన్ని తెచ్చిపెట్టడం ఖాయం. ఈ సిరీస్ బంగ్లాదేశ్, వెస్టిండీస్ లపై విజయం తర్వాత జరుగుతుండటంతో టీమిండియా ధీటైన విశ్వాసంతో ఉంది.

టీం ఇదే 

India: Virat Kohli (c), Shikhar Dhawan, KL Rahul, Shreyas Iyer, Rishabh Pant (wk), Ravindra Jadeja, Shivam Dube, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jasprit Bumrah, Navdeep Saini, Shardul Thakur, Manish Pandey, Washington Sundar, Sanju Samson.

Sri Lanka: Lasith Malinga (c), Dhanushka Gunathilaka, Avishka Fernando, Angelo Mathews, Dasun Shanaka, Kusal Perera, Niroshan Dickwella, Dhananjaya De Silva, Isuru Udana, Bhanuka Rajapaksa, Oshada Fernando, Wanindu Hasaranga, Lahiru Kumara, Kusal Mendis, Lakshan Sandakan, Kasun Rajitha