టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్ ఈ ఘనతను సాధించాడు. అదే విధంగా కోహ్లి తన టెస్ట్ కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక టెస్ట్ క్రికెట్‌లో 8 వేల పరుగుల చేసిన ఆరో భారత బ్యాటర్‌గా (Virat Kohli Becomes 6th Indian) కోహ్లి నిలిచాడు.
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఈ ఘనత ( 8000 Test Runs)సాధించారు. విరాట్ కోహ్లి 169 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాదించాడు. 154 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించి సచిన్ తొలి స్ధానంలో ఉన్నాడు. అదే విధంగా కోహ్లి తప వందో మ్యాచ్‌లో మరో రికార్డును కూడా సాధించాడు. 100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న రెండో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఘనత సాధించాడు. 2006లో దక్షిణాఫ్రికాపై 100వ టెస్ట్ మ్యాచ్ ఆడిన పాంటింగ్ 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 47 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే కోహ్లి సెంచరీ సాధిస్తాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ గుండెపోటుతో కన్నుమూత
చారిత్రక టెస్టు ఆడేందుకు ముందు కోహ్లీ మాట్లాడుతూ.. వంద టెస్టు మ్యాచ్‌లు ఆడతానని తానెప్పుడూ అనుకోలేదన్నాడు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణమని పేర్కొన్న వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది. ఈ టెస్టుతో.. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ సరసన కోహ్లీ చేరనున్నాడు. కోహ్లీ వందో టెస్టుకు 50 శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించారు.