టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో మరో ఘనత సాధించాడు. ఫేస్‌బుక్‌లో విరాట్ పాలోవర్ల సంఖ్య 50 మిలియన్లకు చేరింది. తద్వారా విరాట్ కోహ్లి ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ట్విటర్, ఇనస్ట్రాగమ్, ఫేస్‌బుక్ మూడు సోషల్ మీడియా ఖాతాలలో 50 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. అంబటి రాయుడుని నాశనం చేశారు, ఇప్పుడు శాంసన్‌కు కూడా అన్యాయం చేస్తున్నారు, బీసీసీఐపై మండిపడిన పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా
ఇప్పటికే విరాట్‌కు ట్విటర్, ఇనస్ట్రాగమ్‌లో 50 మిలియన్ల పైగా ఫాలోవర్ల ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పరంగా పోర్చ్‌గల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 505 మిలియన్ల ఫాలోవర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ( 381 మిలియన్లు), విరాట్ కోహ్లి(221 మిలియన్లు), నేమర్ జూనియర్(187 మిలియన్లు)తో కోనసాగుతున్నారు.