IND vs PAK, T20 ప్రపంచ కప్ మ్యాచ్ తర్వాత మహ్మద్ షమీని (Mohammad Shami After IND vs PAK) లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా (Virat Kohli Slams Trolls) స్పందించాడు. ఈ ట్రోల్స్ చాలా దయనీయమైనవి' అని అన్నాడు. షమీపై జరుగుతున్న ట్రోలింగ్‌ను ఖండిస్తూ.. అతడికి అండగా టీమ్ లోని ఆటగాళ్లందరూ ఉన్నారన్నాడు.
ఓ వ్యక్తిని మత ఆధారంగా టార్గెట్ చేయడం విషాదకరమని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని.. కానీ మతం ఆధారంగా వివక్ష (Attacking Someone Over Religion Is Most Pathetic' ) చూపడం వ్యక్తిగతంగా ఇష్టపడనని కోహ్లీ తెలిపాడు. మహమ్మద్ షమీ ఇండియాకు ఎన్ని మ్యాచ్‌లను గెలిపించాడో ట్రోలర్స్‌కు తెలియదని అన్నాడు. అతని పట్టుదలపై అవగాహన లేని వారు ఏదేదో అంటుంటారని.. అలాంటి వారిపై ఒక నిమిషం కూడా ఆలోచించమని తెలిపాడు. ఈ విషయంలో షమీకే తమ మద్దతు అని కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేశాడు.
Heres PTI Tweet
Attacking someone over religion is most pathetic: Virat Kohli on online trolling of Mohammed Shami
— Press Trust of India (@PTI_News) October 30, 2021
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు (India Vs New Zeland) ముందు విలేకరుల సమావేశంలో టీమ్ఇండియా విరాట్ కోహ్లీ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ గురించి మాట్లాడాడు. హార్దిక్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, ఆరో బౌలర్ అవసరమైతే సిద్ధంగా ఉంటాడని విరాట్ పేర్కొన్నాడు. జట్టులో శార్దూల్ ఠాకూర్ స్థానం గురించి విరాట్‌ను ప్రశ్నించగా, అతను మా ప్లానింగ్‌లో భాగమని చెప్పాడు. వారికి సామర్థ్యాలు ఉన్నాయని తెలిపాడు. అయితే, ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించాలా లేదా అనేది విరాట్ స్పష్టం చేయలేదు.
టీ20 వరల్డ్‌కప్‌లో (ICC T20 World Cup 2021) పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో (India Vs Pakistan) టీమ్ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే! అయితే ఈ మ్యాచ్‌లో బౌలర్ మహ్మద్ షమీ ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మహ్మద్ షమీపై ట్రోలింగ్ (Trolls on Shami) చేయడం మొదలుపెట్టారు. షమీతో పాటు అతడి కుటుంబసభ్యులనూ దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు. షమీపై వస్తోన్న ట్రోలింగ్ ను పలువురు క్రికెటర్లతో పాటు మాజీలు ఖండిస్తూ.. షమీకి మద్దతుగా నిలుస్తున్నారు.