
200 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించిన ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సునాయాస విజయం సాధించింది. ఐపీఎల్ 16వ సీజన్‌లో మే 9వ తేదీ రాత్రి జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. యువ బ్యాట్స్‌మెన్ నెహాల్ వధెరా అతనికి మరో ఎండ్ నుండి బాగా మద్దతు ఇచ్చాడు. సూర్య 35 బంతుల్లో 83 పరుగులు చేయగా, వధేరా 34 బంతుల్లో 52 పరుగులతో అజేయ అర్ధ సెంచరీని ఆడాడు. ఈ సమయంలో వధేరా బ్యాట్ నుంచి వచ్చిన సిక్సర్లు వాంఖడే స్టేడియంలో బీభత్సం సృష్టించాయి.
22 ఏళ్ల వధేరా తొలి బంతికే సింగిల్ తీసి సూర్యకు స్ట్రైక్ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసి ఆ తర్వాత నేహాల్‌కు స్ట్రైక్‌ను అందించాడు. బౌండరీ అవతల పార్క్ చేసిన కారును టార్గెట్ చేస్తూ నేహాల్ బాదిన సిక్సర్ మ్యాచ్ కు హైలైట్ అని చెప్పాలి. నేహాల్ కొట్టిన సిక్సర్ నేరుగా వెళ్లి బౌండరీ అవతల పార్క్ చేసిన టాటా టియాగో ఈవీ కారుకు తగిలి దానికి డెంట్ పడింది.
IPL 2023: రూ. 3 కోట్లు నీకు దండగ, ఫినిషర్‌గా పనికిరావు
అయితే నేహాల్ వధేరా షాట్ వల్ల ప్రయోజనం ఉంది. ఎవరైతే టాటా టియాగో EVని టార్గెట్ చేసి సిక్స్ బాదుతారో, ఆ షాట్‌కు బదులుగా పేదలకు ఐదు లక్షల రూపాయలను విరాళం ఇవ్వనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ రూల్ ప్రకారం బంతి నేరుగా వెళ్లి కారుకు తగిలింది. దీంతో కర్ణాటకలోని కాఫీ తోటల జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు ఐదు లక్షల రూపాయల సాయం అందుతుంది.
Nehal wadhera ne to nuksan kara dia #MIvRCB #SuryakumarYadav #ViratKohli #MumbaiIndinas #RCBvMI #viralvideo #IPL2023 pic.twitter.com/ZQVhB3Ay4T
— Ankit tiwari (@HrishabhTiwari7) May 9, 2023