Paris, July 28: పారిస్ ఒలింపిక్స్ (Aris Olympics) ఓ ప్రేమజంటకు వేదికగా మారింది. ఇద్దరు అర్జెంటీనా అథ్లెట్ల లవ్ ప్రపోజల్‌తో ఈ మెగా టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంటకు సంబంధించిన ఫొటోను ఒలంపిక్ గేమ్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పారిస్ 2024 ఒలింపిక్స్ జూలై 26న ప్రారంభోత్సవం సందర్భంగా అనేక మంది అథ్లెట్లు పారిస్‌లో గుమిగూడారు. ఒక అథ్లెట్ తన తోటి అథ్లెట్‌కు అందరి ముందు ప్రపోజ్ చేసి ఒలింపిక్ గేమ్ ప్రారంభించాడు. ఈ మధురమైన క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The first marriage proposal at the #Paris2024 Olympic Village! 💍🩵🤍
Pablo Simonet and Pilar Campoy had a very special moment surrounded by their handball and hockey teammates from Argentina. 😍
Congratulations, you two! All the best! 👏 pic.twitter.com/hJJyf9lBMI
— The Olympic Games (@Olympics) July 24, 2024
పాబ్లో సిమోనెట్, పిలార్ కాంపోయ్ మధ్య ప్రేమ కథను @TheOlympicGames అకౌంట్ ద్వారా ట్విట్టర్‌లో జూలై 24న షేర్ చేసింది. పారిస్ 2024 ఒలింపిక్ విలేజ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ పోస్టుకు ప్రపోజల్ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయగా 106.5 వేల వ్యూస్, 665 లైక్‌లు వచ్చాయి. పాబ్లో, పిలార్‌ల లవ్ స్టోరీ.. పారిస్ 2024 ఒలింపిక్స్ చిరస్మరణీయమైన క్షణంగా నిలిచింది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు లవ్ బర్డ్స్‌ను అభినందించారు. ప్రేమ గాలిలో ఉందని మరో నెటిజన్ కామెంట్ చేయగా, ప్రేమ జంటకు అభినందనలు అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించారు.
ఒలింపిక్ రింగ్‌లు, ఎంగేజ్‌మెంట్ రింగ్‌లు ఒకేచోట అంటూ మరో యూజర్ పోస్టు పెట్టాడు. ఈ లవ్ ప్రపోజల్ వీడియోను పాబ్లో సిమోనెట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశారు. ఈ అథ్లెట్ జంట 2015 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. 9 ఏళ్ల తమ లవ్ జెర్నీని ప్రపంచమంతా చాటిచెప్పేందుకు ఒలింపిక్స్ వేదికగా బహిర్గంతం చేసింది. పబ్లో మోకాలిపై కూర్చొని పిలర్‌కు ప్రపోజ్ చేశాడు. ఆ వెంటనే పిలర్ కూడా ఓకే అనేసింది. అంతే.. ఉంగరం తొడిగేసి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత జట్టు సభ్యులతో ఫొటోలు దిగారు.