పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024: సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్ నిర్వహించిన పారిస్ నగరంలోనే ఈసారి పారాలింపిక్స్ జరగబోతున్నాయి. దీన్ని కూడా విజయవంతం చేసేందుకు అన్నీ చర్యలు చేపట్టింది పారిస్ ప్రభుత్వం. మొత్తం 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉంది. టోక్యో పారాలింపిక్స్‌తో పోలిస్తే... పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024 మహిళల విభాగాల్లో మరో 10 మెడల్ ఈవెంట్స్‌ను జోడించారు. నేటి నుంచి పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024, గూగుల్ స్పెషల్ డూడుల్ ఇదిగో, 11 రోజుల పాటు అలరించనున్న 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్
ఈసారి భారత్ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత్ నుంచి అత్యధికంగా ఈసారే పోటీ పడుతున్నారు. టోక్యో క్రీడల్లో 54 మంది పోటీపడగా భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 12 క్రీడాంశాల్లో 10కి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంధర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ విడుదల చేసింది. పారాలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్టేడియం బయట నిర్వహించనున్న ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. నేటి నుంచి 17వ సమ్మర్ పారాలింపిక్ గేమ్స్, భారత్ నుంచి 84 మంది బరిలోకి, పారాలింపిక్ క్రీడలు పారిస్ 2024 పూర్తి సమాచారం ఇదిగో..
గత ఏడాది హాంగ్జూలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో మనవాళ్లు 29 స్వర్ణాలు సహా 111 పతకాలతో సత్తాచాటారు. ఇక ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలతో పాటు మొత్తం 17 పతకాలు సాధించి ఆరో స్థానంలో నిలిచారు. పురుషుల జావెలిన్‌త్రో ఎఫ్ 64 విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్ సుమిత్ అంటిల్, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగం అవని లేఖరా డిఫెండింగ్ పారాలింపిక్ చాంపియన్‌లుగా బరిలోకి దిగుతున్నారు.
చేతులు లేకున్నా కాళ్లతో గురి తప్పకుండా బాణాలు సంధించగల పారా ఆర్చర్ శీతల్ దేవి, మందుపాతర పేలిన దుర్ఘటనలో కాళ్లు కోల్పోయిన షాట్‌పుటర్ హొకాటో సెమా, ఆంధ్రప్రదేశ్ రోయింగ్ ప్లేయర్ నారాయణ కొంగనపల్లె వంటి వాళ్లు కూడా పారాలింపిక్స్‌లో పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి జివాంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో పోటీ పడుతోంది.
పారిస్ పారాలింపిక్స్ 2024లో పాల్గొనే భారతీయుల పూర్తి జాబితా:
విలువిద్య
హర్విందర్ సింగ్ - పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)
రాకేష్ కుమార్ - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)
శ్యామ్ సుందర్ స్వామి - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)
పూజ - మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)
సరిత - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)
శీతల్ దేవి - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)
అథ్లెటిక్స్
దీప్తి జీవన్‌జీ - మహిళల 400మీ -టీ20
సుమిత్ యాంటిల్ - పురుషుల జావెలిన్ త్రో - F64
సందీప్ - పురుషుల జావెలిన్ త్రో - F64
అజీత్ సింగ్ - పురుషుల జావెలిన్ త్రో - F46
సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో - F46
రింకు - పురుషుల జావెలిన్ త్రో - F46
నవదీప్ - పురుషుల జావెలిన్ త్రో - F41
యోగేష్ కథునియా - పురుషుల డిస్కస్ త్రో - F56
ధరంబీర్ - పురుషుల క్లబ్ త్రో - F51
ప్రణవ్ సూర్మ - పురుషుల క్లబ్ త్రో - F51
అమిత్ కుమార్ - పురుషుల క్లబ్ త్రో - F51
నిషాద్ కుమార్ - పురుషుల హైజంప్ - T47
రామ్ పాల్ - పురుషుల హైజంప్ - T47
మరియప్పన్ తంగవేలు - పురుషుల హైజంప్ - T63
శైలేష్ కుమార్ - పురుషుల హైజంప్ - T63
శరద్ కుమార్ - పురుషుల హైజంప్ - T63
సచిన్ సర్జేరావ్ ఖిలారీ - పురుషుల షాట్‌పుట్ - F46
మొహమ్మద్ యాసర్ - పురుషుల షాట్ పుట్ - F46
రోహిత్ కుమార్ - పురుషుల షాట్ పుట్ - F46
ప్రీతి పాల్ - మహిళల 100 మీ - T35, మహిళల 200m - T35
భాగ్యశ్రీ మాధవరావు జాదవ్ - మహిళల షాట్‌పుట్ - F34
మను - పురుషుల షాట్ పుట్ - F37
పర్వీన్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F57
రవి రొంగలి - పురుషుల షాట్‌పుట్ - F40
సందీప్ సంజయ్ గుర్జార్- పురుషుల జావెలిన్ త్రో-F64
అరవింద్ - పురుషుల షాట్ పుట్ - F35
దీపేష్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F54
ప్రవీణ్ కుమార్ - పురుషుల హైజంప్ - T64
దిలీప్ మహదు గావిత్ - పురుషుల 400 మీ - T47
సోమన్ రాణా - పురుషుల షాట్‌పుట్ - F57
Hokato Hotozhe Sema- పురుషుల షాట్ పుట్ - F57
సాక్షి కసానా- మహిళల డిస్కస్ త్రో- F55
కరమ్జ్యోతి- మహిళల డిస్కస్ త్రో- F55
Rakshitha Raju- Women's 1500 metres T11
అమీషా రావత్: మహిళల షాట్‌పుట్ - F46
భావనాబెన్ అజబాజీ చౌదరి- మహిళల జావెలిన్ త్రో - F46
సిమ్రాన్- మహిళల 100మీ టీ12, మహిళల 200మీ టీ12
కంచన్ లఖానీ - మహిళల డిస్కస్ త్రో - F53
బ్యాడ్మింటన్
మనోజ్ సర్కార్- పురుషుల సింగిల్స్ SL3
నితేష్ కుమార్- పురుషుల సింగిల్స్ SL3, మిక్స్‌డ్ డబుల్స్ SL3-SU5
కృష్ణ నగర్- పురుషుల సింగిల్స్ SH6
శివరాజన్ సోలైమలై- పురుషుల సింగిల్స్ SH6, మిక్స్‌డ్ డబుల్స్ SH6
సుహాస్ యతిరాజ్- పురుషుల సింగిల్స్ SL4, మిక్స్‌డ్ డబుల్స్ SL3-SU5
సుకాంత్ కదమ్- పురుషుల సింగిల్స్ S4
తరుణ్- పురుషుల సింగిల్స్ S4
మానసి జోషి- మహిళల సింగిల్స్ SL3
మన్‌దీప్ కౌర్- మహిళల సింగిల్స్ SL3
పాలక్ కోహ్లీ- మహిళల సింగిల్స్ SL4, మిక్స్‌డ్ డబుల్స్ SL3-SU5
మనీషా రామదాస్- మహిళల సింగిల్స్ SU5
తులసిమతి మురుగేషన్- మహిళల సింగిల్స్ SU5, మిక్స్‌డ్ డబుల్స్ SL3-SU5
నిత్య శ్రీ శివన్- మహిళల సింగిల్స్ SH6, మిక్స్‌డ్ డబుల్స్ SH6
కానో
ప్రాచీ యాదవ్- మహిళల వా' సింగిల్ 200మీ VL2
యశ్ కుమార్- పురుషుల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1
పూజా ఓజా- మహిళల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1
సైక్లింగ్
అర్షద్ షేక్- రోడ్ - పురుషుల C2 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - పురుషుల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - పురుషుల C1-3 1000m టైమ్ ట్రయల్, ట్రాక్ - పురుషుల C2 3000m Ind. పర్స్యూట్
జ్యోతి గదేరియా- రోడ్ - మహిళల C1-3 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - మహిళల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - మహిళల C1-3 500m టైమ్ ట్రయల్, ట్రాక్ - మహిళల C1-3 3000m ఇండో. పర్స్యూట్
బ్లైండ్ జూడో (2)
కపిల్ పర్మార్: పురుషుల -60 కేజీలు J1
కోకిల: మహిళల -48కిలోల జె2
పవర్ లిఫ్టింగ్
పరమజీత్ కుమార్ - పురుషుల 49 కేజీల వరకు
అశోక్ - పురుషుల 63 కేజీల వరకు
సకీనా ఖాతున్ - 45 కిలోల వరకు మహిళల
కస్తూరి రాజమణి - 67 కేజీల వరకు మహిళల
రోయింగ్
అనిత- PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2x
నారాయణ కొంగనపల్లె- PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2x
షూటింగ్
అమీర్ అహ్మద్ భట్- P3 - మిక్స్‌డ్ 25m పిస్టల్ SH1
అవని లేఖా: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R3 - మిక్స్‌డ్ 10m Air Rfl Prn SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1
మోనా అగర్వాల్: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R6 - మిక్స్‌డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1
నిహాల్ సింగ్: P3 - మిక్స్‌డ్ 25m పిస్టల్ SH1, P4 - మిక్స్‌డ్ 50m పిస్టల్ SH1
మనీష్ నర్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1
రుద్రాంశ్ ఖండేల్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1, P4 - మిక్స్‌డ్ 50m పిస్టల్ SH1
సిద్ధార్థ బాబు: R3 - మిక్స్‌డ్ 10m Air Rfl Prn SH1, R6 - మిక్స్‌డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1
శ్రీహర్ష దేవారెడ్డి రామకృష్ణ- R4 - మిక్స్‌డ్ 10మీ ఎయిర్ Rfl Std SH2, R5 - మిక్స్‌డ్ 10మీ ఎయిర్ Rfl Prn SH2
స్వరూప్ మహావీర్ ఉంహల్కర్- R1 - పురుషుల l0m ఎయిర్ రైఫిల్ St SH1
రుబీనా ఫ్రాన్సిస్: P2 - మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ SH1
టోక్యో గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సుమిత్ యాంటిల్ పారిస్ పారాలింపిక్స్‌లో భారత పతాకధారిగా నిలవనున్నాడు.