Neeraj Chopra Clinches Gold Medal at Federation Cup 2024 With 82.27m Throw, DP Manu Secures Silver

New Delhi, July 17: ఈ ఏడాది ఒలింపిక్స్‌ ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ (Paris Olympics) వేదికగా జరుగనున్నాయి. ఈ నెల 26 నుంచి ఆగస్టు 11 వరకు సాగనున్నాయి. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత భారీగానే క్రీడాకారులను పంపుతున్నది. ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీల్లో భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగబోతున్నారు. ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున పాల్గొనే అథ్లెట్ల జాబితాను కేంద్రం బుధవారం ఆమోదించింది. అయితే, మహిళా షాట్ పుటర్ అబా కథువా (Abha Khatua) పేరును మాత్రం జాబితా నుంచి తొలగించారు. అయితే, దీనిపై భారత ఒలింపిక్స్‌ సంఘం వివరణ ఇవ్వలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన అబా పేరు కేంద్రం ఆమోదించిన లిస్ట్‌లో లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. అథ్లెట్లతో పాటు 140 మందితో కూడిన సహాయక సిబ్బంది, అధికారుల బృందం త్వరలోనే పారిస్‌కు ప్రయానం కానున్నది. ప్రస్తుతం అందరి దృష్టి స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపైనే ఉన్నది. 2021 టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో నీజర్‌ స్వర్ణం గెలుపొంది చరిత్ర సృష్టించాడు.

 

మరో వైపు ఇటీవల ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలోనూ భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో పలు అంశాల్లో పతకాలపై అంచనాలున్నాయి. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, ఆర్చరీతో పాటు మరికొన్ని క్రీడాంశాల్లో పతకాలపై భారత్‌ ఆశలు పెట్టుకున్నది. టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం 119 మంది సభ్యుల బృందాన్ని పంపింది. ఒక స్వర్ణంతో సహా ఏడు పతకాలను భారత్‌ సాధించింది.

Shubman Gill New Record: విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సంచలన రికార్డు, ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విదేశీ గడ్డపై నాలుగు విజయాలు సాధించిన కెప్టెన్‌గా అరుదైన ఘనత 

ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన. ఈ సారి షూటింగ్‌లో 21 మంది, హాకీలో 19 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఎనిమిది మంది క్రీడాకారులు టేబుల్ టెన్నిస్‌కు ఏడుగురు, బ్యాడ్మింటన్‌కు ఏడుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సైతం ఉన్నది. రెజ్లింగ్ నుంచి ఆరుగురు, ఆర్చరీ నుంచి ఆరుగురు, బాక్సింగ్ నుంచి ఆరుగురు క్రీడాకారులు, గోల్ఫ్ నుంచి నలుగురు, టెన్నిస్ నుంచి ముగ్గురు, స్విమ్మింగ్‌లో ఇద్దరు. సెయిలింగ్ నుంచి ఇద్దరు, హార్స్‌ రైడింగ్‌, జూడో, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ నుంచి ఒక్కొక్కరు పాల్గొననున్నారు.