Shubman-Gill

జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్ (Team India).. ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.తాజాగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విదేశీ గడ్డపై నాలుగు విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తర్వాత ఈ ఫీట్ సాధించింది గిల్ మాత్రమే. ఒక బాల్‌కి 13 పరుగులు, ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్, వీడియో ఇదిగో..

2019-20 సమయంలో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు న్యూజీలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. అందులో భారత్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించి, 5-0 తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. కోహ్లీ తొలి నాలుగు మ్యాచ్‌లకే నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించాడు. ఐదో మ్యాచ్‌కి అతను అందుబాటులో లేకపోవడంతో.. ఆ ఆఖరి గేమ్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత జింబాబ్వే సిరీస్‌తో ఆ రికార్డును శుభ్‌మన్ గిల్ తిరగరాశాడు.

దే సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. భారత జట్టుకి అత్యధిక విజయాలు సాధించిపెట్టిన కెప్టెన్ల జాబితాలో.. ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ లిస్టులో రోహిత్ శర్మ 50 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ధోనీ (42), విరాట్ కోహ్లీ (32), హార్దిక్ పాండ్యా (10), సూర్యకుమార్ యాదవ్‌ (5) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు