చైనాలో ఆసియా క్రీడలు ముగిసిన రెండు వారాల తర్వాత హాంగ్‌జౌలో మళ్లీ ఆటల సందడి మొదలైంది. పారా ఆసియా క్రీడలు షురూ అయ్యాయి. ఆదివారం హాంగ్‌జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో ఈ క్రీడల ఆరంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చైనా ఉపాధ్యక్షుడు డింగ్ గ్జూజియాంగ్ క్రీడలు మొదలైనట్లు ప్రకటించారు.భారత్ తరఫున 313 అథ్లెట్లు బరిలో ఉన్నారు.
మహిళల VL2 ఫైనల్‌లో కెనోయింగ్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. హాంగ్‌జౌలో సోమవారం జరుగుతున్న 4వ ఆసియా క్రీడలలో భారతదేశం తన ఖాతాను తెరిచింది.ప్రాచీ.. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇరోదాఖోన్ రుస్తమోవాకు 1.022 సెకన్ల తేడాతో బంగారు పతకం మిస్ చేసుకుంది. ప్రాచీ 1:03.47 సెకన్లతో రజత పతకాన్ని ఖాయం చేసుకోగా, ఇరోదాఖోన్ 1:02.125 సెకన్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.జపాన్ క్రీడాకారిణి సాకి కొమట్సు 1:11.635 సెకన్లతో కాంస్య పతకంతో నిష్క్రమించింది.
మరోవైపు, మహిళల VL3 ఫైనల్‌లో సంగీతా రాజ్‌పుత్, షబానా మరియు రజనీ ఝా వరుసగా నాలుగు, ఐదు మరియు ఏడవ స్థానాల్లో నిలవడంతో భారత్ పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన షఖ్జోడా మమదలీవా 58.775 సెకన్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, చైనాకు చెందిన యోంగ్యువాన్ 59.724 సెకన్లతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కజకిస్థాన్‌కు చెందిన ఝానీల్ బల్తాబయేవా 1:07.795 సెకన్లతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.