Novak Djokovic (Photo Credits: Twitter/US Open)

వరల్డ్‌ నంబర్‌వన్, సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (Novak Djokovic) తన ఫ్రస్టేషన్‌ కారణంగా యూఎస్‌ ఓపెన్‌ (US Open 2020) నుంచి డిస్‌ క్వాలిఫై అయ్యాడు. ఆదివారం యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భాగంగా టెన్నిస్‌ ఓపెనింగ్‌ సెట్‌లో ప్రత‍్యర్థి పాబ్లో కార్రెనో బుస్టాపై 5-6 తేడాతో వెనుకబడ్డాడు. వరుసగా మూడు సెట్‌ పాయింట్లన వృథా చేసుకోవడంతో ఫ్రస్టేషన్‌కు గురైన జొకోవిచ్‌ బ్యాట్‌తో బంతిని కోర్టు బయటకు కొట్టాడు. బంతి నేరుగా వెళ్లి లైన్‌ జడ్జ్‌ (మహిళ) గొంతుకు తాకింది. ఇది గమనించిన అతను‌ వెంటనే ఆమె వద్దకు నడిచాడు. బాధతో ఆమె నేలపై కూర్చుండిపోయింది.

అతడు ఆమెకేమైందో అడిగి తెలుసుకుని, తన తప్పుకు క్షమాపణ చెప్పాడు. అయితే ఉద్ధేశ్యపూర్వకంగా ఆమెను కొట్టకపోయినా.. లైన్‌ జడ్జ్‌ను గాయపరిచినందుకు గానూ గేమ్‌ రూల్స్‌ ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవల్సిన పరిస్థితి (Djokovic disqualified) వచ్చింది. కానీ, అధికారులు తనపై చర్యలు తీసుకోవటం ఇష్టం లేని జొకోవిచ్‌ వెంటనే స్టేడియంనుంచి బయటకు వెళ్లిపోయాడు.

Here's Video 

28 వరుస విజయాలతో అప్రతిహతంగా సాగుతున్న అతని విజయపరంపరకు బ్రేకులు పడినట్టైంది. ఈ టైటిల్ గెలిస్తే 18వ గ్రాండ్ స్లామ్ సాధించినట్టు అయ్యేది. అయితే దీనిపై రిఫరీని జకోవిచ్ బతిమాలుకున్నా ఫలితం లేకుండా పోయింది. కావాలని చేయకపోయినా.. రూల్ ఈజ్ రూల్ అని చెప్పడంతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.

టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జకోవిచ్ ఈ అనూహ్య ఘటనతో అర్ధాంతరంగా తన పోరు ముగించాల్సి వచ్చింది. ఈ టోర్నీ గెలిస్తే... మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్స్ సాధించిన వాడిగా రికార్డులకెక్కేవాడు. జకోవిచ్ గ్రౌండ్ నుంచి వెళుతుంటే అందరూ అలా చూస్తుండిపోయారు.