NewDelhi, September 19: భారత స్టార్ రెజ్లర్ బజ్ రంగ్ పూనియా (Bajrang Punia) కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ (Wrestling championship) లో నాలుగు పతకాలు (Four Medals) సాధించిన భారత తొలి రెజ్లర్ గా నిలిచాడు. ఆదివారం సెర్బియాలోని బెల్ గ్రేడ్ లో ముగిసిన తాజా ఎడిషన్ లో అతను అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. పురుషుల ఫ్రీ స్టయిల్ 65 కేజీల విభాగంలో పూనియా ఈ పతకం నెగ్గాడు. వాస్తవానికి ఈ టోర్నీలో బజ్ రంగ్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు.
కోహ్లీ, పాండ్యా ‘షకబూమ్’ డ్యాన్స్ చూశారా.. వీడియో ఇదిగో!
కానీ, అతడిని ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ ఫైనల్ చేరుకోవడంతో భారత రెజ్లర్ కు రెజిచేజ్ ద్వారా కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది. దీన్ని బజ్ రంగ్ సద్వినియోగం చేసుకున్నాడు. 2013లో 60 కేజీల విభాగంలో కాంస్యం, 2018లో 65 కేజీల విభాగంలో రజతం గెలిచిన బజ్ రంగ్ 2019లో కాంస్యం గెలిచాడు. మొత్తం ఏడు సార్లు పోటీపడ్డ అతను నాలుగు పతకాలతో ప్రపంచ చాంపియన్ షిప్ లో అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.