Credits: Twitter

Srisailam, Dec 25: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి గంటల పాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దోర్నాలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో శ్రీశైలం మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Humanbody Wireless Charger: శరీరంలో అమర్చే వైర్‌ లెస్‌ చార్జర్‌ అభివృద్ధి.. నిర్ణీత వ్యవధి తర్వాత శరీరంలో కలిసిపోయే మెడికల్‌ ఇంప్లాంట్

నేడు, రేపు కూడా

వరుస సెలవులు కావడంతో శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామి అమ్మవార్లను దర్శించునేందుకు వేల సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. భక్తులు అధికంగా వాహనాల్లో రావడం వల్ల ట్రాఫిక్‌ పెరిగిపోయింది.  సోమ, మంగళవారం కూడా సెలవు దినాలు కావడంతో.. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.