 
                                                                 Vijayawada, JAN 28: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం (AP Elections) రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. అటు ఎన్నికల సంఘం తుది ఓటర్ల లిస్టును కూడా రెడీ చేసింది. అయితే ఎన్నికల ముందు జరిగే సాధారణ బదిలీల ప్రక్రియ కూడా మొదలైంది. ఏకంగా ఒకేసారి 21 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది (IAS Officers Transferred) ప్రభుత్వం. చాలా కాలంగా ఒకే చోట ఉన్న ఐఏఎస్ లకు స్థానచలనం కల్పించింది. కొద్ది రోజుల క్రితం కూడా పలువురు ఐఏఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది ప్రభుత్వం.ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి (Jawahar Reddy) ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు వీళ్లే..
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా మంజీర్ జిలానీ
తిరుపతి జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీషా
నంద్యాల జిల్లా కలెక్టర్‌గా కె.శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా అభిశక్త్ కిశోర్
పార్వతీపురం జిల్లా మన్యం జాయింట్ కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రోణంకి గోపాలకృష్ణ
కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ప్రవీణ్ ఆదిత్య
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తిక్
అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా భావన
నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజీంద్రన్
విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డి
మున్సిపల్ శాఖ కమిషనర్‌గా బాలాజీ రావ్
ఏపీయూఎప్‌ఐడీసీ ఎండీగా హరిత
పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రిటేర్‌గా ఇల్లకియా
సర్వే సెటిల్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్‌గా గోవిందరావు
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా తమీమ్ అన్సారియా
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా రోణంకి కూర్మనాథ్
జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా విశ్వనాథన్
ప్రభుత్వరంగ సంస్థల విభాగ కార్యదర్శిగా రేఖా రాణి
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి బదిలీ
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
