Hyderabad, June 29: సినీ నటుడు, కమెడియన్ అలీ (Ali) వైసీపీకి (YSRCP) గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. 2019 ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎంతో కాలంగా పదవి కోసం ఎదురుచూసిన అలీకి 2022లో ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అప్పటి జగన్ ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో ఆయన రెండేళ్లు కొనసాగారు.
వైఎస్సార్సీపీకి నటుడు అలీ రాజీనామా.
ఇకపై రాజకీయాలకు స్వస్తి పలికిన అలీ pic.twitter.com/Qv761Y13ga
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024
మారిన సీన్
2024 ఎన్నికల్లో అయినా తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు వస్తుందని అలీ భావించారు. కానీ ఆ ఆశ నెరవేరలేదు. టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో అలీ ఎక్కడ కూడా కనిపించలేదు. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో.. అలీ వైసీపీని వీడారు. ఇకపై రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు.
రైతులకు రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదు! కీలకవ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి