Representational Picture

Vijayawada, April 22: ఏపీవాసులకు అలర్ట్ (Alert). వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో (Coastal Andhra) పలుచోట్ల, రాయలసీమలో (Rayalaseema) అక్కడక్కడ వర్షాలు (Rains) కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 25 వరకు కోస్తా రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. ఫలితంగా సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నిన్న రాయలసీమలో పలు చోట్లు వర్షాలు కురిశాయి. కాగా, నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ఫుల్ డిమాండ్.. రెట్టింపు కానున్న కోచ్‌లు.. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న రైలు.. 16 బోగీలతో నడపాలంటూ రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు.. మరో 10 రోజుల్లోనే అందుబాటులోకి అదనపు కోచ్‌లు

పది మండలాల్లో వడగాల్పులు

రాష్ట్రంలోని అనకాపల్లి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని పది మండలాల్లో నిన్న వడగాల్పులు వీచాయి. పలు చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కమలాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Basava Jayanti 2023 Images & Basaveshwar Jayanti HD Wallpapers for Free Download Online: రేపే బసవ జయంతి.. బసవేశ్వర మహారాజ్ ఫోటోలు, హెచ్ డీ వాల్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి..