Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ఫుల్ డిమాండ్.. రెట్టింపు కానున్న కోచ్‌లు.. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న రైలు.. 16 బోగీలతో నడపాలంటూ రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు.. మరో 10 రోజుల్లోనే అందుబాటులోకి అదనపు కోచ్‌లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-తిరుపతి (Secunderabad-Tirupati) మధ్య ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలుకు ముందుగా ఊహించినట్టుగానే ప్రయాణికుల (Passengers) నుంచి పెద్దయెత్తున డిమాండ్ (Demand) వస్తున్నది.
Hyderabad, April 22: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-తిరుపతి (Secunderabad-Tirupati) మధ్య ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలుకు ముందుగా ఊహించినట్టుగానే ప్రయాణికుల (Passengers) నుంచి పెద్దయెత్తున డిమాండ్ (Demand) వస్తున్నది. ఈ రైలులో ప్రయాణించేందుకు జనం ఆసక్తి చూపిస్తుండడంతో టికెట్లు దొరకడం కూడా నానాటికీ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రైలులో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 8 కోచ్‌లతోనే ఈ రైలు నడుస్తుండగా వీటిని రెట్టింపు చేయాలని యోచిస్తున్నారు.
మరో పది రోజుల్లో..
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రస్తుతం 120-130 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. దీంతో చాలామంది ప్రయాణికులకు టికెట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను రెట్టింపు చేసి 16 కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఫలితంగా మరో 10 రోజుల్లోనే అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
(The above story first appeared on LatestLY on Apr 22, 2023 08:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

