Vij, January 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు, మోదీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ విషయంపై ఏపీ ప్రజలకు నేను భరోసా ఇస్తున్నా అన్నారు. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు NDRF ముందుంటుందని తెలిపారు.
ఎన్‌ఐడీఎం, ఎన్డీఆర్‌ఎఫ్ క్యాంపస్‌లను ప్రారంభించిన అమిత్ షా...అదే విధంగా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే NDA ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన మ్యాన్ మేడ్ డిజాస్టర్‌గా నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సైనికులకు అభినందనలు చెప్పారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఎన్డీఆర్ఎఫ్ వారిని చూడగానే ధైర్యంగా ఊపిరి పీల్చుకున్నామని చెబుతుంటారు...విదేశాలలో కూడా ఎన్డీఆర్ఎఫ్ సేవలపై ప్రశంసలు వచ్చాయి అన్నారు.
విదేశాల్లో విపత్తు వచ్చినప్పుడు సైతం NDRF ప్రధాన పాత్ర పోషించిందన్నారు సీఎం చంద్రబాబు. 2011 జపాన్, 2015 నేపాల్ దేశాల్లో విపత్తు సంభవించినప్పుడు NDRF ఆడుకుందన్నారు. 2023 టర్కీ భూకంపం సమయంలో NDRF అందించిన సేవలు మరువలేనివి...నేను అమిత్ షా లాంటి హోం మంత్రిని ఎప్పుడూ చూడలేదు అన్నారు. ఏపీ బీజేపీ సమావేశం.. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశం
అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చారు.. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి అన్నారు. కేంద్రం మార్గదర్శకంలో పోలవరం డయాఫ్రమ్ పనులు మొదలయ్యాయి..
కేంద్రం మద్దతుతో ఏప్రిల్ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం అన్నారు.
విశాఖ ఉక్కుకు కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థిక సాయం చేసి ప్రాణం పోసింది... ఇటీవల విశాఖ రైల్వేజోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు అన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలన్నారు చంద్రబాబు.