ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. నోవాటెల్ 7వ అంతస్తులో జరుగుతున్న సమావేశానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరో 20 మంది నాయకులు పాల్గొన్నారు.
ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతం, కేంద్ర సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై చర్చించనున్నారు. అధ్యక్ష పదవిపై కూడా చర్చించే జరిగే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ సమావేశం నేపథ్యంలో నోవాటెల్ హోటల్ బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక అంతకముందు అమిత్ షాకు ఘనస్వాగతం పలికారు సీఎం చంద్రబాబు. విశాఖ ఉక్కు (Visakha Steel) తెలుగు ప్రజల సెంటిమెంట్ అని, అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. అలాగే ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చే విషయంలో తన వంతు ప్రయత్నాలు చేస్తానని సానుకూలంగా స్పందించారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్.. అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం.. ఉండవల్లిలో బాబు, పవన్ తో జరిగిన భేటీలో అమిత్ షా
Union Home Minister Amit Shah attends AP BJP Meeting
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం
ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా
నోవాటెల్ 7వ అంతస్తులో జరుగుతున్న సమావేశానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరో 20 మంది నాయకులు
ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు… https://t.co/nc4WahUNKW pic.twitter.com/UMFVvkUZJU
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)