Karanam Dharmasri Gets Teacher Job: ఎగ్జామ్ రాసిన 24 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేకు టీచర్ జాబ్, 1998 డీఎస్సీ లిస్ట్‌లో పేరు చూసి ఆశ్చర్యపోతున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

Vijayawada, June 21: వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి (Karanam Dharmasri) టీచర్ ఉద్యోగం వచ్చింది. 1998లో డీఎస్సీ రాసిన ప్రస్తుత చోడవరం ఎమ్మెల్యే (Chodavaram MLA) కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయుడిగా (Teacher)ఎంపికయ్యారు. 1998 డీఎస్సీ వివాదం కోర్టులో ఎట్టకేలకు పరిష్కారం కావడంతో అప్పట్లో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల ఫైల్‌పై సీఎం జగన్ (YS Jagan) తాజాగా సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాలో కరణం ధర్మశ్రీ పేరు కూడా ఉంది. అప్పట్లో డీఎస్సీకి (DSC) ఎంపికైన వారిలో కొందరు కూలీలుగా మారగా, మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. అయితే ధర్మశ్రీ మాత్రం రాజకీయాల్లోకి వచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యే (MLA) అయ్యారు. డీఎస్సీ రాసినప్పుడు తనకు 30 సంవత్సరాలని ఎమ్మెల్యే ధర్మశ్రీ గుర్తు చేసుకున్నారు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివానని, ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని అనుకున్నానని పేర్కొన్నారు. 1998 డీఎస్సీ వివాదాల్లోకి జారుకోవడంతో ఆ తర్వాత బీఎల్ అభ్యసించడం మొదలుపెట్టినట్టు చెప్పారు.

AP Inter Results: రేపే ఏపీ ఇంటర్ 1st, 2nd Year ఫలితాలు విడుదల, ఆన్ లైన్ లో రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు లింక్ ఇదే  

తనకు టీచర్ గా ఉద్యోగం (Teacher Job) రావడం ఆనందంగా ఉందన్నారు. టీచర్ కావాలన్న ఆశతో మూడు సార్లు డిఎస్పీ రాశానని తెలిపారు. మూడోసారి అర్హత సాధించానని పేర్కొన్నారు. తనకు సోషల్, ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టమన్నారు. నాడు-నేడులో భాగంగా స్కూల్లో కొన్ని సార్లు మాస్టర్ గా పాఠాలు చెప్పానని గుర్తు చేశారు. డిఎస్సీ అర్హత సాధించినా ఉద్యోగం రాకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అనేక పోరాటాలు చేశానని పేర్కొన్నారు.

Andhra Pradesh: నిరుద్యోగులు రెడీ అవ్వండి, ఏపీలో 8వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్, జాబ్‌ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టిన ఏపీ సీఎం జగన్  

ఎందరో సీఎంలు చేయ్యలేనిది సీఎం జగన్ చేశారని కొనియాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. కానీ, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగులతో ఆటలాడకూడదని సూచించారు. అర్హత సాధిస్తే ఉద్యోగం కల్పించాలన్నారు. ఇప్పటికే చాలా మందికి రిటైర్డ్ వయస్సు వచ్చేసిందని వెల్లడించారు. ఇది కొంతమందికి మంచి అవకాశం అన్నారు. టీచర్ కాలేకపోయానని బాధ ఉన్నా..రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయ్యడం సంతృప్తగానే ఉందని పేర్కొన్నారు.