Amaravati, June 21: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్‌మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) సమగ్రంగా సమీక్షించారు. జాబ్ క్యాలెండర్‌లో ( job calendar) భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను సీఎం జగన్‌కు (Chief Minister YS Jagan Mohan Reddy) అధికారులు నివేదించారు.
బ్యాక్‌లాక్ పోస్టులు, ఏపీపీఎస్‌సీ, వైద్య, ఆరోగ్య – కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్ మెంట్‌ను సమగ్రంగా సీఎం జగన్ సమీక్షించారు. సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. భర్తీచేయాల్సిన పోస్టుల్లో 1198 పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయని వారు అన్నారు. 2021–22లో 39,654ల పోస్టుల భర్తీ చేశామని అధికారులు తెలిపారు.
సీఎం మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్‌లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను సీఎం జగన్ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు.నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీచేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇక్కడ ఖాళీలు భర్తీచేయకపోవడం సరికాదు. భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు అని సీఎం జగన్ తెలిపారు. ఉన్నతవిద్యలో టీచింగ్ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్ద పీటవేసేలా నిర్ణయాలు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రెగ్యులర్ పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియమకాలు జరగాలి. దీనికోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
పోలీసు ఉద్యోగాల భర్తీపైన కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో సీఎంకు నివేదించాలన్న చెప్పారు. కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.