Tirumala: తిరుమలపై అసత్య ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేలా కుట్ర పూరిత పోస్టులు, 18 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ నెల 19న వాచీల ఈ–వేలం
Tirumala Tirupati Devasthanams | Photo: Twitter

Tirupati, August 14: తిరుమల శ్రీవారికి చెందిన 1,500 కిలోల బంగారు నగలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు (18 Social media users booked) చేశారు. జనసేన పార్టీ, పండు బుద్దాల ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాల నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేలా కుట్ర పూరిత పోస్టులను పోస్టు చేశారు. మరో 16 మంది ఈ దుష్ప్రచారాన్ని తమ ట్విట్టర్‌ ఖాతాల నుంచి షేర్‌ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి (Tirumala Tirupati Devasthanams) చెందిన 1,500 కిలోల బంగారాన్ని ఎస్‌బీఐలో తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం.. మమ్మల్ని తరువాత కాపాడండి. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. స్వామీ ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద’ అని టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారు. భక్తుల మనోభావాలను గాయపరిచి విద్వేషాలు రగిల్చే ఆలోచనతో వీరు ఈ దుష్ప్రచారం చేశారని విజిలెన్స్‌ అధికారులు ఆధారాలతో సహా తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

టీటీడీ ఛైర్మన్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి, స్వామి వారీ సేవ చేసుకొనే భాగ్యం రెండోసారి దక్కడం తన అదృష్టమని తెలిపిన వైసీపీ నేత

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీల ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈనెల 19న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్‌ ద్వారా ఈ–వేలం వేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్‌ కంపెనీలకు చెందిన వాచీలు మొత్తం 38 లాట్లు ఉన్నట్లు తెలిపింది. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయ పని వేళల్లో 0877–2264429 నంబర్‌లో గానీ, www.tirumala.org రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌ www.konugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో గానీ సంప్రదించాలని కోరింది.