Vjy, July 5: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన ఐటీ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. తాజాగా జగ్గయ్యపేట రూరల్ మండలం చిల్లకల్లు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాస్తి శ్వేత(Software Engeneer Jasthi Swetha) కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సైబర్ ఉచ్చులో పడి ఆమె లక్షల రూపాయలు కోల్పోయినట్లుగా సమాచారం. తన తోటి స్నేహితులను కూడా కొంత నగదు కావాలని కోరినప్పటికీ వారు సహకరించకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది.
స్నాప్ చాట్ అనే కొత్త ఆన్‌లైన్ గేమ్‌లో గేమింగ్ ఆడినట్లుగా సమాచారం. ఆత్మహత్య (techie jumps to death) కేసును దర్యాప్తు కోసం సైబర్ సెల్‌కు అప్పగించారు. తన స్వగ్రామం నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై ఒక్కతే వచ్చినట్లుగా సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. చిల్లకల్లులోని చెరువు వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఆమె నడుచుకుంటూ చెరువులోకి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆత్మహత్య ( software engineer committed suicide) చేసుకుంటున్నట్టు తల్లికి సెల్‌ఫోన్‌లో శ్వేత మెసేజ్ పెట్టింది. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. మమ్మీ, డాడీ ఐ లవ్ యూ..’ అంటూ తన ఫోన్ ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టింది. అనంతరం రాత్రి 9.00 గంటల సమయంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
శ్వేతా వాయిస్ మెసేజ్ చూసిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ వాయిస్ మెసేజ్ ఆధారంగా జగ్గయ్యపేట రూరల్ పరిధిలోని చిల్లకల్లు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ యువతి వాహనాన్ని గుర్తించి, చెరువులో గాలింపు చేపట్టారు. రాత్రి 12.00 గంటల సమయంలో యువతి మృతదేహం చెరువులో లభ్యమైంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సిన తమ కుమార్తె ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.