Andhra Pradesh Road Accident:  అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, పెళ్లి బృందంతో వెళ్తున్న కారు, లారీ ఢీకొని 9 మంది మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతులకు 2 లక్షల ఆర్థిక సాయం..
Accident Representative image (Image: File Pic)

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది స్పాట్ డెడ్ అయ్యారు. మరొకరు  ఆస్పతికి తీసుకువెళుతుండగా మార్గం మధ్యలో మరణించారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన పెళ్లి బృందం కారులో వెళ్తున్నారు. అయితే, ఉరవకొండ మండలం సమీపంలో ఈ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును కంటైనర్ లారీ ఢీ కొట్టింది.

ఈ ఘటనలో 9 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు స్థానికులు, అధికారులు. మృతులంతా అనంతపురం టౌన్‌కు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ లారీ అధిక స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే  అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియో ప్రకటించారు.

ప్రమాదం పట్ల మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ప్రధాని సహాయ నిధికింద ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.