AP Cabinet Meeting (photo-X/TDP)

Vjy, Juy 16: అమరావతిలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం, పౌరసరఫరాల శాఖ రూ.2వేల కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు ఆమోదముద్ర వేశారు. నూతన ఇసుక విధానంపై త్వరలో విధివిధానాలు రూపొందించనున్నారు.

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది.వ్యవసాయ మంత్రి అచ్చం నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు.  ప్రధాని మోదీ జగన్ సాయం కోరక తప్పదా, రాజ్యసభలో తగ్గిన ఎన్టీయే కూటమి బలం, నేటితో ముగిసిన నలుగురు నామినేటెడ్ ఎంపీల పదవీకాలం

రెండు రోజుల్లో చర్చించి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీకి కేబినెట్ ఆదేశాలు ఇచ్చింది. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా? లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశాన్ని ఖరారు చేయాలని సూచించింది. రెండు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.  మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు...ప్రత్యేక హోదాపై క్లారిటితో రావాలని సీపీఎం సూచన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశాల్లో ఓటు ఆన్ అకౌంట్ పెట్టాలా? లేకుంటే ఆర్డినెస్స్ పెట్టాలా.. అనే అంశంపై ఈ భేటీలో కీలక చర్చ జరిగింది.

Here's Meeting Video

అయితే మూడు రోజుల పాటు ఈ అంసెబ్లీ సమావేశాలు జరగనున్నాయని సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక శ్వేత పత్రాల ప్రస్తావనను సైతం అసెంబ్లీలో తీసుకురావాలని కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు.