Chandrababu Delhi Visit(Pic Credit ANI)

Vjy, Jul 16:  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ సాయంత్రం ఏపీలోని గన్నవరం విమానశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హస్తినకు చేరుకోనున్నారు. తన పర్యటన సందర్భంగా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు చంద్రబాబు. ప్రధానంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు.

బుధవారం జరిగే ఈ భేటీలో విభజన సమస్యలపై ప్రధానంగా చర్చజరగనుంది. అలాగే దేశ రాజకీయాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. రెండు వారాల వ్యవధిలోనే చంద్రబాబు హస్తినకు వెళ్తుండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ముఖ్యమంత్రి అల్పాహారం పథకం పేరిట బ్రేక్ ఫాస్ట్‌ను అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తాజాగా ఇదే స్కీంను తమిళనాడులోని ఎయిడ్ స్కూళ్లలో ఉచితంగా విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని సోమవారం ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రారంభించారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీ సీపీఎం నేతలు కీలక సూచన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిశ్రమ,విభజన హామీలపై స్పష్టమైన క్లారిటీ తీసుకుని రావాలని బాబుకు సూచించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యుత్ స్మార్ట్ మీటర్లు అన్నీ తీసేయాలని డిమాండ్ చేశారు.

గత ఐదేళ్ళలో ఎస్ఈజెడ్ రూపంలో భూములు తీసుకున్న పరిశ్రమలు రాలేదని...వాటిని వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే రైతులకు ఉచిత బీమా కల్పించాలని...రైతుల కోసం ఉచిత ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టాలని కోరారు.