Vjy, July 5: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తగిన చేయూత ఇవ్వాలని కోరారు.
రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీయే ఎంపీలతో కలిసి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక, మూడో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు.. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, చంద్రబాబుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్, భవిష్యత్తులో మీ కార్యకర్తలకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడి
అనంతరం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. మరో కేంద్రమంత్రి రామ్‌దాస్ అఠావలెతోనూ ఆయన భేటీ కానున్నారు. అనంతరం ఫిక్కీ ఛైర్మన్, ప్రతినిధులను కలవనున్నారు. భారత్‌లో జపాన్ రాయబారితో చర్చలు జరపనున్నారు. సాయంత్రం చంద్రబాబు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.