Nellore, July 4: వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..అధికార పార్టీపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు.. ఇలాంటి వెంటనే ఆపాలని వైఎస్ జగన్ హెచ్చరించారు.
‘పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు. పిన్నెల్లిపై హత్యానేరం మోపారు. కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న ఘటన జరిగితే.. మే 23న హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిజంగా దాడి జరిగితే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదు?. ఒక్క పిన్నెల్లిపైనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలానే దాడులు కొనసాగుతున్నాయి. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలి కానీ.. దౌర్జన్యం కాదని అన్నారు. అప్పటిదాకా కూల్చివేతలు చేపట్టవద్దు, వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు కీలక తీర్పు, స్టేటస్ కో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ
టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. దాడుల రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవు. లెక్క జమ చేసి ప్రజలు బాబుకు గట్టిగా జవాబిస్తారు. ప్రతీ గ్రామం, మండల పరిధిలో రెడ్ బుక్‌ల పేరుతో దాడులు చేస్తున్నారు. టీడీపీ వాళ్లే కొట్టి.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. దాడుల రాజకీయాలు మంచిది కాదు.. దగ్గరుండి దాడులను పోత్సహించడం దుర్మార్గం. ఇలాంటివి వెంటనే ఆపాలని హెచ్చరిస్తున్నా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Here's Videos
సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ వార్నింగ్
చంద్రబాబుని హెచ్చరిస్తున్నాము.. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, మీ పాపాలు పండుతున్నాయి. తప్పుడు రాజకీయాలు నువ్వొక్కడివే చేస్తున్నావు.
ఇదే మాదిరి కొనసాగితే.. రేపు పొద్దున నువ్వు వేసే బీజం.. చెట్టు అవుతుంది. భవిష్యత్తులో మీ కార్యకర్తలకు కూడా… pic.twitter.com/hMd5NGnDJt
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2024
చంద్రబాబు మీరు దగ్గరుండి తప్పుడు సంప్రదాయాల్ని ప్రోత్సహించడం అతి దుర్మార్గం. దయచేసి ఇక్కడితో ఈ దాడులకి పుల్‌స్టాప్ పెట్టండి.
ఇది రిక్వెస్ట్ కాదు.. హెచ్చరిక🔥
-వైయస్ఆర్సీపీ అధ్యక్షులు @ysjagan గారు pic.twitter.com/qFXzCo2X1a
— YSR Congress Party (@YSRCParty) July 4, 2024
వైయస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఇది మంచి పద్ధతి కాదు
ప్రజలకి మంచి చేసి వారి గుండెల్లో స్థానం సంపాదించుకుని ఓటు అడగండి తప్ప.. దౌర్జన్యాలు చేసి కాదు
తీరు మార్చుకోకపోతే లెక్కా జమా చేసి @ncbnకి ప్రజలే బుద్ధి చెప్తారు.
-వైయస్ఆర్సీపీ అధ్యక్షులు @ysjagan గారు pic.twitter.com/rp6YbMHLcN
— YSR Congress Party (@YSRCParty) July 4, 2024
.@JaiTDP కి ఓటు వేయలేదనే కారణంతో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ.. దొంగ కేసులు పెడుతున్నారు.
వైయస్ఆర్సీపీ పాలనలో వివక్షకి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికీ మంచి చేశాం
కానీ.. ఈరోజు కేవలం ఓటు వేయలేదనే కారణంతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా… pic.twitter.com/tSsDsLt796
— YSR Congress Party (@YSRCParty) July 4, 2024
ప్రజల్లో వ్యతిరేకతతో వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల కారణంగానే 10 శాతం ఓట్లతో చంద్రబాబు గెలిచారు. కులమతాలు చూడకుండా మేము సంక్షేమం అందించాం. ప్రజలు ఇప్పటికీ మా వెంటే ఉన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా, అమ్మ ఒడి అందలేదు. అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టారు. పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా డబ్బులు అందలేదు. రైతు భరోసా రూ.20వేల హామీ ఏమైందో తెలియదు’ అంటూ కామెంట్స్ చేశారు.
చంద్రబాబుని హెచ్చరిస్తున్నాము.. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, మీ పాపాలు పండుతున్నాయి. తప్పుడు రాజకీయాలు నువ్వొక్కడివే చేస్తున్నావు. ఇదే మాదిరి కొనసాగితే.. రేపు పొద్దున నువ్వు వేసే బీజం.. చెట్టు అవుతుంది. భవిష్యత్తులో మీ కార్యకర్తలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇదేమాదిరి దాడులు కొనసాగితే రియాక్షన్ కూడా అంతే స్థాయిలో ఉంటుందని వైఎస్ జగన్ మండిపడ్డారు.