AP High Court (photo-Wikimedia Commons)

వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని.. వైఎస్సార్‌సీపీ వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. స్టేటస్‌ కో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చట్ట నిబంధనలు అనుసరించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.ప్రతిదశలో వైసీపీ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది. 2 నెలల్లో భవనాల అనుమతులు, ఆధారాలు, రికార్డులు అధికారుల ముందు ఉంచాలని వైసీపీని న్యాయస్థానం ఆదేశించింది.  వీడియో ఇదిగో, నెల్లూరు చేరుకున్న జగన్, ఘన స్వాగతం పలికిన అభిమానులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్న వైసీపీ అధినేత

తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదకరంగా ఉంటే తప్ప కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అయితేనే చర్యలు తీసుకోవాలని.. లేదంటే పార్టీ కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు మూసివేసింది.