Vjy, Nov 9: రాజమండ్రి బాలాజీపేట వద్ద గూడ్స్ రైలు పట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు భోగి పూర్తిగా పట్టాలపై పడిపోయింది. ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని భోగిని పట్టలాపై నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.
రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, రద్దు అయిన తొమ్మిది రైళ్లు
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా విశాఖ వైపునకు వెళ్లు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్తిలి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. బాలాజీపేట విశాఖ నుంచి విజయవాడవైపు వెళ్తున్న గూడ్స్ రైలు భోగి పట్టాలపై పడిపోయింది. దీంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు 9 రైళ్లను రద్దు చేశారు. 2 రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్టు తెలిపారు.
రైళ్ల వివరాలు ఇవే..
- విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు.
- గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు.
- గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు
- కాకినాడ పోర్టు-విజయవాడ రైలు పాక్షికంగా రద్దు.
- విజయవాడ-రాజమండ్రి రైలు పాక్షికంగా రద్దు. ఇక, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.