Welfare Schemes in AP: అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేసిన ఏపీ సర్కారు, కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపిన ఏపీ సీఎం జగన్
Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, Dec 28: ఏపీలో ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు (under various welfare schemes) సంబంధించి, అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన 9,30,809 మంది లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.703 కోట్లను జమ (disburse Rs. 703 crore for leftover beneficiaries) చేశారు. దీంతో పాటు 3,44,497 మందికి పెన్షన్‌ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు, 1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల లబ్ధిదారులతో కలిపి మొత్తంగా 18,47,996 మందికి ప్రయోజనం కల్పించారు.

సీఎం జగన్ (CM YS Jagan) మాట్లాడుతూ.. గతంలో సంక్షేమ పథకాలకు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని.. నేడు ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నేడు అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి నగదు జమ చేస్తున్నామన్నారు. 9,30,809 మంది ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఒమిక్రాన్ భయాలు, కరోనా వ్యాప్తి కట్టడి చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష, రాష్ట్రంలో కొత్తగా 54 పాజిటివ్ కేసులు నమోదు

అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారు.. సంక్షేమ పథకం అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులు పరిశీలించి, అర్హులైన వారికి డిసెంబర్‌ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి జూన్‌లో లబ్ధి కల్పిస్తారు. జూన్‌ నుండి నవంబర్‌ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి డిసెంబర్‌లో లబ్ధి కల్పిస్తారు.

వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ (మహిళలు), వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ (2019–20), ఖరీఫ్‌ (2020), వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ (రెండవ విడత), జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాల పథకం.. వీటిలో అర్హులై లబ్ది పొందనివారు దరఖాస్తు చేసుకోవచ్చు.