Vjy, July 31: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Andhra Pradesh government) రాబోయే నాలుగు నెలలకు రూ.1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్సు జారీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆన్‌లైన్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని గవర్నర్‌కు పంపి ఆమోదం పొందాక ఆర్డినెన్సు జారీ చేస్తారు. ఆ తర్వాత శాసనసభ సమావేశాల్లో తీర్మానాన్ని ఆమోదం పొందుతారు.
ఏపీ శాసనసభకు 2024 మేలో ఎన్నికలు రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ (vote on account budget with Rs.1.30 lakh crore) ప్రవేశపెట్టాల్సి వచ్చింది. గత ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టగా తొలి నాలుగు నెలలకు సభ ఆమోదం తెలిపింది. ఏప్రిల్, మే, జూన్, జులైలకు రూ.1,08,052.33 కోట్లకు వైసీపీ ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. పాత ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ గడువు జులై 31తో ముగుస్తోంది. ఆగస్టు నుంచి కొత్త ఖర్చులకు ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవాల్సి ఉంది.దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్ శాసనసభకు సమర్పించాల్సి ఉంది. ఏపీలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మళ్లీ తెరపైకి, న్యాయం చేయాలంటూ పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు, ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగిందంటే..
శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రం వెలువరించిన సంగతి విదితమే. పాత బడ్జెట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల కోసం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌కు సంబంధించి ప్రభుతవం ఆర్డినెన్సు జారీ చేస్తోంది. ఈ నాలుగు నెలల కాలంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు, రహదారుల మరమ్మతులు, పోలవరం పనులు, కొన్ని పెండింగు బిల్లుల చెల్లింపులకు సంబంధించీ ఓట్ ఆన్ ఎకౌంట్‌లో ఆమోదం పొందనున్నట్లు సమాచారం. తదుపరి సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.