Agrigold Compensation Row: అగ్రిగోల్డ్‌ బాధితులకు రెండో దశ కింద రూ.666.84 కోట్ల నగదు జమ, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని తెలిపిన ఏపీ సీఎం జగన్
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy | File Photo

Amaravati, August 24: అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. రెండో దశ కింద రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ (Agrigold Compensation) చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందని, గత ప్రభుత్వం (Andhra Pradesh Govt) అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైందని సీఎం జగన్ అన్నారు.

రాహుల్ హత్య కేసు మిస్టరీ, తెరపైకి కొత్తగా మహిళ, కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్‌ చేసిన పోలీసులు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమా, ముమ్మరంగా విచారణ చేస్తున్న మాచవరం పోలీసులు

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారుల బ్యాంకు ఖాతాల్లో పరిహారాన్ని సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. రెండో దశ కింద రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిట్‌దారులకు రూ.666.84 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అయింది.