Rahul's Death Case Update (Photo-Video grab)

Vijayawada, August 24: పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో (Rahul's Death Case Update) రోజురోజుకూ పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంను పోలీసులు విజయవాడ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచనున్నారు. అంతకముందు కేసులో ఏ-2గా ఉన్న కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. కాగా విజయవాడ విడిచివెళ్లొదంటూ రెండు రోజుల క్రితం కోగంటి సత్యంకు పోలీసులు నోటీసులు అందించారు.

తాను విజయవాడలోనే ఉంటానని.. ఎప్పుడు పిలిచినా వస్తానని కోగంటి సత్యం పోలీసులకు వివరించాడు. అయితే సోమవారం మధ్యాహ్నం కోగంటి సత్యం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై విజయవాడ మాచవరం పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించగా.. సత్యంను బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్టు చేసి దేవనపల్లి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.

ఇదిలా ఉంటే గాయత్రి అనే మహిళ రాహుల్‌కు రూ.6 కోట్లు ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వివాదమే రాహుల్‌ను హత్య (vijayawada businessman rahul murder case) చేసే వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ మహిళ ఎవరు, అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు ఇచ్చింది, రాహుల్ హత్యలో మహిళ కూడా ఉండడానికి కారణం ఏంటి.. అనే దానిపై పోలీసులు కూపీ లాగారు. మాచవరం పోలీసులు సెక్షన్‌ 302, 120బీ రెడ్‌ విత్‌ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఏ1 గా కొరడ విజయ్‌కుమార్‌, ఏ2గా కోగంటి సత్యం, ఏ3గా పద్మజ, ఏ4గా పద్మజ, ఏ5గా గాయత్రిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

భర్త తాగుబోతు, వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, హెచ్చరించడంతో భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య, వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన

మృతుడు రాహుల్ ప్రకాశం జిల్లా ఒంగోలు వాసి. ఏ-1 నిందితుడు విజయ్‌కుమార్ కూడా అక్కడే చదివాడు. ఆ క్రమంలో రాహుల్‌తో పరిచయం ఏర్పడి.. వారి కుటుంబానికి దగ్గరయ్యాడు. తర్వాత రాహుల్ కంపెనీలో భాగస్వామి అయ్యాడు. ఏడాది తర్వాత మరో ఇద్దరు భాగస్వాములుగా వచ్చారు. దీంతో ఆర్థిక వ్యవహారాల్లో వివాదాలు మొదలయ్యాయి. రాహుల్ పుంగనూరులో మరో పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో వివాదం మరింత రాజుకుంది.

కోరాడ ఫైనాన్స్ కంపెనీలో భాగస్వామి అయిన గాయత్రి కుమార్తె పద్మజకు.. ఎయిమ్స్‌లో పీజీ సీటు ఇప్పించడానికి రాహుల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకు రాహుల్‌కు గాయత్రి రూ.6కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. ఈ డబ్బు విషయంలోనే ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. ఈ నెల 18న రాత్రి 7గంటల సమయంలో రాహుల్.. కారులో డీవీమానర్ రోడ్డులో పుడ్ ప్లాజా ఎదురుగా ఉన్న రైల్ మిల్ వద్దకు వచ్చారు. దీంతో కోరాడ, సీతయ్య అనే వాచ్‌మన్, మరో యువకుడు కలిసి రాహుల్ కారులోకి వెళ్లారు. గాయత్రికి ఇవ్వాల్సిన డబ్బుల గురించి అడగ్గా.. రాహుల్ ఎదురు తిరిగినట్లు సమాచారం.

రాహుల్‌ హత్యకేసు..పోలీసులకు లొంగిపోయిన నిందితుడు కోరాడ విజయ్‌, రహస్యప్రాంతంలో నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేసిన మాచవరం పోలీసులు

కాసేపటికి కోరాడ.. కారు దిగి వెళ్లిపోయారు. కారులో ఉన్న మిగిలిన ఇద్దరు కలిసి రాహుల్‌ను హత్య (Rahul murder case) చేసినట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఒకరైన సీతయ్య.. గతంలో రాహుల్ కంపెనీలో వాచ్‌మన్‌గా పనిచేసినట్లు సమాచారం. అయితే ఈ వాచ్‌మన్ విజయ్‌కుమార్ బంధువని.. కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని కోరాడకు చేరవేస్తున్నాడనే కారణంతో విధుల నుంచి తొలగించాడు. ఇలా రాహుల్ హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. కోరాడ, కోగంటి సత్యంలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా నిందితులను రహస్యంగా విచారిస్తున్నారు.

ఇక మరోక కథనం ప్రకారం.. వ్యాపార లావాదేవీలే రాహుల్‌ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నిరోజులుగా రాహుల్‌, వ్యాపార భాగస్వామి విజయ్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. తన వాటా 15 కోట్లు ఇచ్చేయాలంటూ రాహుల్‌పై విజయ్ ఒత్తిడి తెచ్చాడు. నిందితుడు విజయ్ గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడాడు. ఎన్నికల్లో ఓటమితో భారీగా నష్టపోయానని.. వెంటనే డబ్బులివ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. రాహుల్ కాలయాపన చేస్తుండటంతో పక్కా ప్రణాళికతో హత్య చేశాడని తెలుస్తోంది.