Andhra Pradesh: సింగిల్‌ జడ్జి తీర్పును ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి, కోర్టు ధిక్కార కేసులో నెలరోజుల శిక్ష, రూ.2వేల జరిమానా విధించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి
TTD EO Dharma Reddy (Photo-TTD)

Amaravati, Dec 14: కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి హైకోర్టు (Andhra Pradesh HC) నెలరోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించినస సంగతి విదితమే.జరిమానా చెల్లించని పక్షంలో మరో వారంపాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నెల 27లోపు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) ముందు లొంగిపోవాలని ధర్మారెడ్డిని ఆదేశించింది.

అనంతరం ఆయన్ను జైలుకు పంపా­లని రిజిస్ట్రార్‌కు స్పష్టంచేసింది. ఈ మేర­కు న్యాయమూర్తి జస్టిస్‌ కుంభజడల మన్మథరావు మంగళవారం తీర్పు వెలువరించారు.ఇదే కేసులో జైలుశిక్ష విధిస్తూ జస్టిస్‌ మన్మథరావు ఇచ్చిన తీర్పుపై ధర్మారెడ్డి (EO dharma Reddy) ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్‌ శేషసాయి ధర్మాసనం, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

అవ్వాతాతలకు సీఎం జగన్ గుడ్ న్యూస్, వచ్చే నెల నుంచి పెన్షన్‌ను రూ.2750కి పెంచుతూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం, జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు

టీటీడీ ధర్మ ప్రచార పరిషత్‌లో ప్రో­గ్రాం అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి 2011 జనవరిలో టీటీడీ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీనిని రద్దుచేయడంతో పాటు ప్రోగాం అసిస్టెంట్లుగా తమ సర్వీసులను క్రమబద్ధీకరించేలా టీటీడీ అధికారులను ఆదేశించాలని కోరుతూ కొ­మ్ము బాబు, రామావత్‌ స్వామి నాయక్, భూక్యా సేవ్లానాయక్‌లు 2011లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌ 13న తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు టీటీడీ నోటిఫికేషన్‌ను రద్దుచేశారు. అలాగే, పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ టీ­టీ­డీ అధికారులను ఆదేశిస్తూ తీర్పుచెప్పారు.

చిత్తూరుజిల్లాలో అమరరాజా గ్రూపు కొత్త ప్లాంట్, 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపిన మంగళం ఇండస్ట్రీస్‌

ఈ తీర్పుపై టీటీడీ అధికారులు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలుచేశారు. టీటీడీ అధికారులు కౌంటర్‌ దాఖలు చేస్తూ, సర్వీసు క్రమబద్ధీకరించాలన్న ఉత్తర్వులపై ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశామని, అందువల్ల ఆ ఉత్తర్వులను అమలుచేయలేకపోయామని చెప్పారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అప్పీల్‌ పేరుతో టీటీడీ అధికారులు ఆరు నెలల గడువు తీసుకున్నారని.. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్నారు. ఒకవేళ తమ ఉత్తర్వుల అమలుకు మరింత గడువు కావాలనుకుని ఉంటే, ఆ విషయంలో కోర్టు నుంచి అనుమతి తీసుకుని ఉండొచ్చునన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు ధర్మారెడ్డిని బాధ్యుడిగా చేస్తూ అతనికి నెలరోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

మరోవైపు.. సర్వీసు క్రమబద్ధీకరణపై ఈ ఏడాది ఏప్రిల్‌ 13న జస్టిస్‌ మన్మథరావు ఇచ్చిన తీర్పుపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మంగళవారం స్టే విధించింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. లంచ్‌మోషన్‌ రూపంలో టీటీడీ అధికారుల అప్పీల్‌ను మంగళవారం ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. టీటీడీ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌. సత్యనారాయణ ప్రసాద్‌ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే విధించింది.