COVID19 in AP:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్‌పై ఎలాంటి భయాలు అక్కర్లేదు, దేనికైనా యంత్రాంగం సిద్ధంగా ఉందన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ; రాష్ట్రంలో కొత్తగా 70 కోవిడ్ కేసులు నమోదు
COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Amaravati, February 23:  దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కోవిడ్ -19 యొక్క సెకండ్ వేవ్ గురించి కేంద్రం హెచ్చరిక జారీ చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేనప్పటికీ, ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ పూర్తిగా సంసిద్ధంగా ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో వేల సంఖ్యలో కేసులు నమోదు కాగా, గత కొన్నాళ్లుగా కోవిడ్ కేసుల రోజువారీ గణనలో భారీగా పడిపోయింది. రాష్ట్రంలో ప్రతిరోజు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య 100లోపే ఉంటుంది.

3 టి - (ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్) స్ట్రాటజీని రాష్ట్రంలో కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఏపి ఆరోగ్యశాఖ సమర్థవంతగా కోవిడ్ మహమ్మారిపై పోరాడి విజయం సాధించింది. ఈ క్రమంలో కోవిడ్‌ యొక్క సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కోవటానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ (కోవిడ్ మేనేజ్‌మెంట్ మరియు వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర పేర్కొన్నారు

ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,268 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 70 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,89,409 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,86,514గా ఉంది. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో విశాఖ జిల్లాలో ఒక కోవిడ్ మరణం నమోదైంది. దీంతో  ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7168కి పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 84 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,81,666 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 575 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.