Tadepalli, June 17: ఈనెల 19న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అధ్యక్షతన తాడేపల్లి(Tadepalli) క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులందరికీ ఇప్పటికే ఆహ్వానం పంపారు. నలుగురు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు కూడా ఆహ్వానం పంపించారు. వీడియో ఇదిగో, తాడేపల్లి జగన్ నివాసం వద్ద 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ, జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులతో జగన్ అధికారికంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. వారం రోజుల క్రితం శాసన మండలి సభ్యులతోనూ ఆయన సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులతోనూ సమావేశమై తదుపరి కార్యచరణపై వారితో చర్చించనున్నారు. జగన్ రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి, పోలవరం ప్రాజెక్ట్ సర్వనాశనం చేశాడని చంద్రబాబు మండిపాటు, ఇంకా ఏమన్నారంటే..
భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధానాంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఇప్పుడే ఏం అయిపోలేదని.. అధైర్య పడొద్దని, పార్టీ చేసిన మంచిని ప్రజలు అంత సులువుగా మరిచిపోరని, త్వరలోనే పార్టీ పుంజుకుంటుందని వాళ్లందరికీ ధైర్యం చెప్పారాయన. అలాగే.. ప్రతిపక్షాలకు కాస్త టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. మరోవైపు.. టీడీపీ శ్రేణుల్లో గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తారని ప్రకటించారు కూడా.