Kodali Nani (photo-Twitter)

టీడీపీ అధినేత చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు. శుక్రవారం ఆయన టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి’’ అని కొడాలి నాని పేర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్‌లు గుడివాడకి చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేను. నా చివరి వరకు సీఎం జగన్ వెంటే ఉంటానని అని కొడాలి స్పష్టం చేశారు.

175 సీట్లలో అభ్యర్థులను నిలబట్టలేని ఆ వ్యక్తి మనకు ప్రత్యర్థి, టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాబుపై విరుచుకుపడిన సీఎం జగన్

అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టాడు. నవనీత్ కౌర్, సుమలత ఇద్దరూ సినీ హీరోయిన్లు. ఈ ఇద్దరూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎంపీలు అయ్యారు.16 పార్టీలతో పొత్తులు పెట్టుకుని పవన్ ఏం సాధించాడు?’’ అంటూ కొడాలి నాని సెటైర్లు విసిరారు. చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేతగా ఉండటం, పవన్ కోరిక ఎమ్మెల్యే కావటం.. దీని కోసం ఈ ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్నారు’’ అని కొడాలి ఎద్దేవా చేశారు. రెండు పార్టీలను కలుపుకుంటే గానీ పవన్‌ శాసనసభకు వెళ్లలేని పరిస్థితి. జగన్‌ సీఎం సీటు నుంచి కదిపే దమ్ము చంద్రబాబు, పవన్‌కు లేదు. నా ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతా’’ అని కొడాలి నాని పేర్కొన్నారు.