Mock G20 Conclave in Visakha: విశాఖ జీ-20 సన్నాహాక సదస్సు, రెండో రోజు పట్టణీకరణ అంశంపై ప్రతినిధులతో చర్చలు, పెట్టుబడులకు అవకాశాలు, ప్రత్యేకతలపై ప్రదర్శనలు
CM Jagan in G20 (Photo-Video Grab)

visakha, Mar 29: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న జీ20 సన్నాహక సదస్సు మూడు రోజుల పాటు జరుగుతున్న సంగతి విదితమే. ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సన్నాహాక సదస్సు.. నేటితో రెండో రోజుకి చేరింది. బుధవారం రెండో రోజూ జీ-20 మీట్‌లో భాగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ అంశంపై ప్రతినిధులు చర్చించనున్నారు. అలాగే ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రత్యేకతలపై ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు.

జీ-20 ప్రతినిధులకు మర్యాదపూర్వక విందిచ్చారు సీఎం జగన్‌. సీఎం మాట్లాడుతూ విశాఖలో గడిపే ప్రతి సమయం, ప్రతి క్షణం చెరిగిపోని జ్ఞాపకంలా మిగిలిపోతుందన్నారు. సాగర నగరం ప్రతి ఒక్కరికీ మధురమైన అనుభూతిని మిగుల్చుతుందని అన్నారు. … వాళ్ల ముందు ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచన, లక్ష్యం అన్నారు.

జులై 11 నుంచి అమరావతి కేసు విచారణ, ఒకే కేసు పూర్తి కానిదే మరో కేసు విచారించలేమని తెలిపిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరణ

తమ ప్రభుత్వం వచ్చాక 30లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 22లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామంటూ వివరించారు. ఒక్కోచోట పెద్దపెద్ద టౌన్‌షిప్‌లు, ఊళ్లే నిర్మాణమవుతున్నాయని జీ-20 డెలిగేట్స్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఈ గృహ సముదాయాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం, అందుకు మీ నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నట్లు చెప్పారు.

మీ ఆలోచనలు అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. జీ-20 సదస్సులో చర్చించండి-సలహాలు, సూచనలు ఇవ్వండి అంటూ ప్రతినిధులను కోరారు. సస్టెయిన్‌బుల్‌ పాలసీలతో సరైన మార్గనిర్దేశకత్వం చేయగలిగితే పేదలకు ఇళ్లు సమకూరతాయన్నారు. జీ-20 సమ్మిట్‌లో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ IWG సమావేశాలు జరుగుతున్నాయి. మంగళవారం మొదలైన ఈ సమావేశాలు మరో మూడ్రోజులపాటు సాగనున్నాయ్‌. వన్‌ ఎర్త్‌-వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఫ్యూచర్‌ థీమ్‌తో అనేక సమస్యలపై చర్చించబోతున్నారు ప్రతినిధులు.

ఈ సదస్సుకు జీ20 దేశాలతోపాటు యూరోపియన్‌ కంట్రీస్‌కి చెందిన 57మంది ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. నిన్న యోగా, మెడిటేషన్‌, పౌష్టికాహార వినియోగంపై చర్చలు జరిగాయి, అలాగే మౌలిక సదుపాయాల కల్పనపైనా డిస్కషన్స్‌ చేశారు. నేడు స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, మెగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌, వేస్టే మేనేజ్‌మెంట్‌ అండ్ ఎనర్జీపై క్షేత్రస్థాయిలో వర్క్‌షాపు నిర్వహిస్తారు. ఇక చివరి రోజు పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పనపై చర్చిస్తారు డెలిగేట్స్‌. సాగర తీరంలో జరుగుతోన్న జీ-20 సదస్సుతో విశాఖకు ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని ఆశిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే, ఏపీకి పెట్టుబడులు కూడా వస్తాయని భావిస్తోంది.

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారు.. ఏపీ స్పీకర్ తమ్మినేనిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రపతికి కూన రవికుమార్ ఫిర్యాదు

జీ - 20 సదస్సు సందర్భంగా విశాఖ సుందరీకరణ కు 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం . ఆర్కే బీచ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్ వరకూ ఉన్నమార్గాన్ని అత్యంత అందంగా తయారుచేశారు . అలాగే అతిధులు చేరుకునే ఎయిర్పోర్ట్ నుండి వైజాగ్ సిటీ వరకూ ఉన్న హైవే ను సరిక్రొత్తగా మార్చేసారు. ఎటుచూసినా అతిధులకు, ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ .. రంగురంగుల లైట్లతో వైజాగ్ ను మరింత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు.

వైజాగ్ లో రెడ్ జోన్ గా ప్రకటించిన మార్గాలు ఇవే :

1)రాడిసన్ బ్లూ రిసార్ట్స్,

2)ముడసర్లోవ పార్క్,

3)కైలాసగిరి కొండ,

4)ఆర్.కె. బీచ్,

5)జిందాల్ వేస్ట్ నుండి ఎనర్జీ ప్లాంట్, కాపులుప్పాడ రోడ్

6) ఎస్.సి.ఏ.డి.ఏ , మాధవధార