Representational Image (Photo Credits: Pixabay)

Guntur, Feb 7: కొడుకు దురాగతాలను తట్టుకోలేని కన్న తల్లి కొడుకును చంపేసింది. పేగు తెంచుకు పుట్టినవాడు నిత్యం అవమానాలకు గురి చేస్తూ..మద్యం, గంజాయి తాగి వేధింపులకు పాల్పడుతుంటే సహించలేని కన్న పేగు బిడ్డను (Guntur Tragedy) కడతేర్చింది. గుంటూరు జిల్లాలోని నగరంపాలెం పోలీసుస్టేషన్‌ పరిధిలొ ఈ ఘటన (Tragedy in Guntur) జరిగింది. నగరంపాలెం పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఎ.మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం 8వ లైనులో వల్లపు పోతురాజు, సుమలత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె పుష్పాంబికకు వివాహం కాగా, కుమారుడు సిద్ధార్థ (17) సిమెంట్‌ పనులు చేస్తుంటాడు.

తల్లి సుమలత మున్సిపాలిటీలో కాంట్రాక్ట్‌ కార్మికురాలిగా పనిచేస్తోంది. పది సంవత్సరాల క్రితం ఆమె భర్త పోతురాజు మరణించాడు. అయితే చేతికి అందివచ్చిన కొడుకు సిద్ధార్థ చిన్ననాటి నుంచే చెడు స్నేహాలు చేయటంతో దురలవాట్లకు బానిసగా మారాడు. నిత్యం మద్యం, గంజాయి తాగుతూ ఉన్నాడు. అంతే కాకుండా తల్లి సుమలతను డబ్బుల కోసం వేధింపులకు గురిచేస్తుండేవాడు. డబ్బులు ఇవ్వకుంటే.. ఇంటిపై రాళ్లు వేయటం, తల్లిని చిత్రహింసలకు గురి చేయటంతో పాటు, కొడుతుండేవాడని పోలీసులు తెలిపారు.

ఇద్దర్నీ చంపేసాం..మళ్లీ మేం తిరిగి బతికించుకుంటాం, మదనపల్లెలో ఇద్దరు కూతుర్లను దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక మాయలో ఘాతుకం

కాగా లాలాపేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఏటుకూరు రోడ్డులో ఒక చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు కావటంతో సుమారు 14 నెలల పాటు విజయవాడ జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఇక శుక్రవారం రాత్రి కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లి తెల్లవారుజామున 4 గంటల సమయంలో రావటంతో, అప్పటికే పలు చోరీలు చేసిన కుమారుడు సిద్ధార్ధను ఎక్కడికి వెళ్లి వచ్చావని తల్లి ప్రశ్నించగా ఆమెను నానా దుర్భాషలాడాడు.

సిద్ధార్థ వ్యవహరిస్తున్న తీరుతో బంధువులు, చుట్టుపక్కలవారు సుమలతను అవమానకరంగా మాట్లాడుతుండటంతో పలుమార్లు కొడుకును తీరు మార్చుకోవాలని హెచ్చరించింది. అయినా ఎటువంటి మార్చు రాకపోవటంతో విసిగిపోయిన తల్లి సుమలత శనివారం మధ్యాహ్నం ఫూటుగా మద్యం తాగి వచ్చి నిద్రిస్తున్న కుమారుడి కాళ్లు, చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టరు చుట్టి, ఊపిరి ఆడకుండా కవర్‌ కట్టడంతో పాటు, దిండుతో అదిమి (mother killed her son) హతమార్చింది.

చేపల కూర గొడవ..మంచం కోడితో వ్యక్తిని చంపిన మరో వ్యక్తి, శ్రీకాకాళం జిల్లా అనుమానాస్పద హత్యను చేధించిన పోలీసులు, మీడియాకు వివరాలను వెల్లడించిన పాతపట్నం సీఐ రవిప్రసాద్‌

కుమారుడు సిద్ధార్థను హత్య చేసిన తల్లి సుమలత నేరుగా నగరంపాలెం స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. తన కుమారుడి తీరుతో విసిగిపోయి తానే హత్య చేసినట్టు పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు నివ్వెరపోయారు. స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని సిద్ధార్ధ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.