unknown-person-attacks-tdp-leader Former MPP Polnati Seshagiri Rao in-tuni (Photo-Video Grab)

Amaravati, Nov 24: ఏపీలో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో (attempted murder Case) నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను అరెస్ట్‌ (Police arrested accused) చేసినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. తునిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. విశాఖపట్నం ఆరిలోవ పెద్దగదుల ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌ అదే ప్రాంతానికి చెందిన అభిరామ్‌కు శిష్యుడుగా ఉన్నారు.ఇతర ప్రాంతాలకు వెళ్లి పూజలు చేసే వీరు కొంతకాలంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరంలో రిటైర్ట్‌ ఉద్యోగి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావు (former MPP Polnati Seshagiri Rao) తనను ఇబ్బందిపెట్టాడని, అతడిని గాయపరిస్తే కొంత డబ్బు ఇస్తానని వారికి గురువు అభిరామ్‌ చెప్పాడు. దీంతో చంద్రశేఖర్‌ తన స్నేహితులతో కలిసి శేషగిరిరావు కదలికలపై నిఘాపెట్టాడు.ఈ నెల 17న ఉదయం చంద్రశేఖర్‌ భవానీ మాల ధరించి, ముఖానికి మాస్క్‌ పెట్టుకుని తుని సమితి ఆఫీసు వీధిలో నివాసం ఉంటున్న శేషగిరిరావు ఇంటికి మోటారు సైకిల్‌ మీద వెళ్లాడు.

షాకింగ్ వీడియో, టీడీపీ నేతను కత్తితో నరికేందుకు ప్రయత్నించిన దుండగుడు, భవాని మాల వేషంలో భిక్ష తీసుకుంటున్నట్లుగా నటిస్తూ దాడి

ఇంటి గేట్లు తీసుకుని లోపలికి వెళ్లి భిక్షం అడిగాడు. మాజీ ఎంపీపీ బియ్యం వేస్తుండగా శేషగిరిరావుపై కత్తితో దాడిచేసి పారిపోయాడు. వెంటనే తేరుకున్న శేషగిరిరావు అక్కడే పడిపోయిన కత్తిని తీసుకుని వెంటపడి చంద్రశేఖర్‌ వీపుపై దాడిచేయడంతో అతనికి గాయమైంది. శేషగిరిరావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సోషల్‌ మీడియాలో వచ్చిన ఊహాచిత్రం ఆధారంగా విస్తృతస్థాయిలో గాలించారు.

పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న చంద్రశేఖర్‌ బుధవారం తుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారి డీఎస్పీ మురళీమోహన్‌కు లొంగిపోయాడు.మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చంద్రశేఖర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ మురళీమోహన్, తుని, ప్రత్తిపాడు సీఐలు నాగదుర్గారావు, కిశోర్‌బాబు పాల్గొన్నారు.