CI Salutes DSP Daughter (Photo-AP Police Twitter)

Tirupati, Jan 4: ఏపీ తెలంగాణ విభజన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ (Police Duty Meet) జరుగుతున్న సంగతి విదితమే. నాలుగు రోజుల పాటు ఇగ్నైట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న తండ్రి డిఎస్పిగా పనిచేస్తున్న కూతురికి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు.

అయితే పోలీసు డిపార్ట్‌మెంట్ లో ఉన్నతాధికారికి కింది తరగతి పోలీసులు సెల్యూట్ చెయ్యటమనేది సాధారణమైన విషయం, అయితే ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన కూతురు కావడంతో ఆ తండ్రి చేసే సెల్యూట్ లో (CI Salutes DSP Daughter) ఆనందంతో పాటు ప్రేమ - గర్వం రెండూ కలిసాయి. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఏపి పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతి లో (Tirupati)‌ నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021 "ఇగ్నైట్" ఈవెంట్లో కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న ఫోటోల కథనంలోకి వెళితే.. 2018 బ్యాచ్ కి చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో "దిశ" విభాగం లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇన్స్పెక్టర్ గా ఆమె తండ్రి శాంసుందర్ పని చేస్తున్నారు

Here's AP Police Tweet

ఈ ఈవెంట్లో కూతురు తన కంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం (Namaste Madam) అంటూ ఆ తండ్రి సెల్యూట్ చేశారు, తను కూడా వెంటనే సెల్యూట్ చేసి.. ఆ తరువాత... ఏంటి నాన్నా...అంటూ గట్టిగా నవ్వేశారు. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరోకటి ఉండదు, నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని ఆ తండ్రి గర్వంగా చెబుతున్నారు.

ఈ దుర్మార్గులు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, తప్పు ఎవరు చేసినా వదిలేది లేదు, అబద్దపు ప్రచారాలు మానుకోవాలి, పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రతిపక్షాలపై తీరుపై ఆగ్రహం

దీనిపై తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. "ఇటువంటివి సహజంగా సినిమాలో చూస్తుంటాం. కాని తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీ కూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతం గా చాలా గర్వంగా ఉంది ఆల్ ది బెస్ట్ ప్రశాంతి" అని డిఎస్పి ప్రశాంతిని అభినందించారు

ఇగ్నైట్" పేరుతో నిర్వహిస్తున్న ఈప్రప్రథమ పోలీస్‌ డ్యూటీ మీట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు. తిరుపతి ఎమ్మార్‌పల్లి ఏఆర్‌ గ్రౌండ్‌లో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ పర్యవేక్షణలో సోమవారం నుంచి ఈనెల ఏడో తేదీ వరకు జరిగే ఈ డ్యూటీ మీట్‌లో 13 జిల్లాల నుంచి 200 మంది పోలీస్‌ ప్రతినిధులు పాల్గొంటారు. సింపోజియంలు, పోలీస్‌ టెక్నాలజీ స్టాళ్ల నిర్వహణలో మరో వందమంది పోలీసులు పాల్గొంటారు.