
Amaravati, January 15: జనవరి 16వ తేది నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్19 టీకా పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా ఆరోగ్య సిబ్బంది మరియు క్షేత్ర సిబ్బంది కి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే జాబితాలో ఎవరికైనా కోవిడ్ సోకి ఉంటే వారికి 14 రోజుల ఐసోలేషన్ తర్వాతే ఇవ్వాలని నిర్ణయించారు. కోవిడ్ సోకి కోలుకున్న వారు కూడా టీకా తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఇవేకాకుండా టీకాకు సంబంధించి ఎలాంటి సందేహాలు, భయాలు ఉన్నా వాటన్నింటినీ నివృత్తి చేయటానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,696 మంది శాంపుల్స్ ను పరీక్షించగా మరో 94 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,85,710కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,82,815గా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి స్వల్పంగానే కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో కృష్ణా జిల్లా నుంచి మరో కొవిడ్ మరణం నమోదైంది. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7139కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 232 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,76,372 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2,199 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.