Coronavirus in AP | Representational Image (Photo Credits: PTI)

Amaravathi, April 2:  ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండగా, చాలా చోట్ల జనం కోవిడ్ నిబంధనలు విస్మరించి రథయాత్రలు, ఇతర వేడుకల్లో పాల్గొంటుండం ఆందోళన కలిగిస్తుంది. దీని మూలంగా రాబోయే వారం, పది రోజుల్లో కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.

కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరుకోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని గవర్నర్ బిశ్వభూషన్ విజ్ఞప్తి చేశారు. ఎల్లప్పుడూ మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని కోరారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమైనదని కాబట్టి వ్యాక్సిన్ పట్ల అపోహలు వీడి అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలని గవర్నర్ సూచించారు. ఇప్పటికే సెలవు రోజుల్లోనూ వ్యాక్సినేషన్ చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,116 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 1288 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 9,04,548 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 9,01,653గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 311 కోవిడ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు నుంచి నుంచి 225 కేసులు, విశాఖపట్నం నుంచి నుంచి 191, మరియు కృష్ణా జిల్లా నుంచి 164 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 5 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,225కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 610 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,88,508 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 8,815 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.