Representational Image (Photo Credits: ANI)

SPSR Nellore, May 11: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన బాధితుడికి అక్కడి ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, కాంపౌండర్లు చికిత్స చేశారు. ప్రథమచికిత్స చేసి, కట్లు కట్టి, మందులివ్వాల్సిన డాక్టరు.. ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి తాపీగా వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో ఆ బాధితుడు (Road Accident Victim Dies) మరణించాడు.

ఘటన వివరాల్లోకెళితే.. నిన్న అనంతసాగరం వద్ద బైకు యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో రామకృష్ణ అనే లెక్చరర్ తో పాటు చిరంజీవి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, వారిని పరిశీలించిన డ్యూటీ డాక్టర్.. ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి (Doctor rested) వెళ్లిపోయాడు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో చిరంజీవి అనే వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. అయితే, రామకృష్ణకు మాత్రం డ్యూటీ డాక్టర్ చికిత్స చేయలేదు. కట్టు కట్టడం దగ్గర్నుంచి సెలైన్ బాటిళ్లు పెట్టేదాకా అంతా సెక్యూరిటీ గార్డులు, కాంపౌండర్లు, స్వీపర్లే (Hospital Security Staff Treated) చూసుకున్నారు. వాళ్లు రామకృష్ణ తలకు కట్టిన కట్టు కూడా ఎంతోసేపు నిలవలేదు. కాసేపటికే అది ఊడి కిందపడిపోయింది.

ఢిల్లీలో దారుణం, డబ్బులు ఇవ్వలేదని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేశాడు, మరో ఘటనలో మధ్య ప్రదేశ్‌లో ఐదేండ్లుగా మేన‌కోడ‌లిపై లైంగిక దాడి

ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. కాగా, ఈ ఘటనపై రామకృష్ణ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింగ్ సిబ్బంది ఎక్కడకు పోయారంటూ మండిపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తిస్తారంటూ నిలదీశారు.

ఈ విష‌యంపై ఈ రోజు నారా లోకేశ్ మాట్లాడుతూ... ప్రజారోగ్య దేవుడిగా ప్ర‌చారం చేసుకుంటోన్న జ‌గ‌న్ వాస్తవానికి ప్రజల పాలిట యముడిలా త‌యార‌య్యార‌ని విమ‌ర్శించారు. గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుప‌త్రిలో చేరడమే శాపమా? అని ప్రశ్నించారు. డ్యూటీ డాక్టర్ ఉండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేయించ‌డం ఏంట‌ని నిల‌దీశారు. ఏపీలో జ‌గ‌న్ కి ప్ర‌జ‌లు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందని విమ‌ర్శించారు. కక్షసాధింపు చ‌ర్య‌లే ల‌క్ష్యంగా జగన్ ప్రభుత్వం ప‌నిచేస్తోంటే ఏపీలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనాల‌ ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని చెప్పారు. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా స‌ర్కారు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని అన్నారు.

ఈ ఘటనపై నాదెండ్ల మ‌నోహ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో ఏపీ స‌ర్కారు తీరుపై మండిప‌డ్డారు. సెక్యూరిటీ గార్డులు, స్వీప‌ర్లే వైద్యులా? అని ఆయ‌న నిల‌దీశారు. వైద్య ఆరోగ్య శాఖ‌ను నిర్వీర్యం చేసిన ఘ‌ట‌న జ‌గ‌న్ దేన‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకీ వైద్య సేవ‌లు దిగ‌జారుతుండ‌డం వైసీపీ స‌ర్కారు వైఫ‌ల్యాన్ని సూచిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.