Srikakulam, April 19: శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామన్నారు. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం తెలిపారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సీఎం జగన్‌ నెరవేర్చారు.

నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ సహా హిర మండలం వంశధార లిప్ట్‌ లిరిగేషన్‌ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త, టికెట్లకు సంబంధించి తేదీలతో సహా క్యాలెండర్ విడుదల చేసిన టీటీడీ, పూర్తి వివరాలు ఇవిగో..

నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సీఎం జగన్‌ అండగా నిలుస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిరహిత పాలన అందిస్తున్నారన్నారు. రైతులను విత్తనం నుంచి విక్రయం వరుకు ఆదుకుంటున్నారని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

సీఎం జగన్ స్పీచ్ ముఖ్యాంశాలు

ఇవాళ నాలుగు మంచి కార్యక్రమాలు జరుపుకున్నాం: సీఎం జగన్‌

►మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం

►నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేసుకున్నాం

►ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ సహా హిర మండలం వంశధార లిప్ట్‌ లిరిగేషన్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం

►ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చివేస్తాయి

►గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారు

►ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుంది

►భవిష్యత్‌లో మూలపేట, విష్ణు చక్రం మరో ముంబై, మద్రాస్‌ కాబోతున్నాయి

►24 నెలల్లో పోర్ట్‌ పూర్తవుతుంది

►పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్లు ఖర్చు చేస్తున్నాం

►పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 35వేల మందికి ఉపాధి లభిస్తుంది

►పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి

►అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి

►మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు

►గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం

►గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి

►పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం

►బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌

►రాష్ట్రంలో ఇప్పటివరకు 4 పోర్టులు మాత్రమే ఉండగా.. మనం అధికారంలోకి వచ్చాక మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం

తీరప్రాంత అభివృద్ధికి సంబంధించి గతంలో ఇలాంటి అభివృద్ధి ఎందుకు జరగలేదు?

►సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే పాలన